కొత్త జీవో రాబోతుంది.. ఫస్ట్ లాభపడేది ప్రభాస్ నే..!

ఏపీ లో ఎన్నో చర్చల తర్వాత టికెట్ వ్యవహారంలో ఇటీవలే జగన్ ప్రభుత్వం సానుకూలంగా స్పందించిన విషయం తెలిసిందే.ఈ మధ్యనే జగన్ తో సినీ పెద్దలు భేటీ అయినా విషయం తెలిసిందే.

 New G.o From Ap Govt To Come This Week Profitable For Prabhas Radheshyam Details-TeluguStop.com

ఈ భేటీ అయినా తర్వాత జగన్ సానుకూలంగా స్పందించారని అందరు తెలిపారు.మరి ఈ భేటీకి వెళ్లిన సభ్యుల్లో ప్రభాస్ కూడా ఉన్న విషయం తెలిసిందే.

ఈ భేటీలో సినిమా టికెట్ ధరల పెంపు, ఇంకా ఐదవ షో కోసం సానుకూలంగా స్పంధించింది.రెమ్యునరేషన్ మినహా 100 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కే సినిమాలను ప్రత్యేకంగా చూస్తామని జగన్ తెలిపారు.

అయితే ఈ భేటీ జరిగి కూడా చాలా రోజులు అవుతున్న ఇంకా జీవో మాత్రం సరికాలేదు.వచ్చే వారం ప్రభాస్ రాధేశ్యామ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

మరి ప్రభాస్ కి అయినా జగన్ మద్దతు లభిస్తుందా లేదా భీమ్లా నాయక్ లాగానే సరిపెట్టుకోవాలా అనే విషయంపై నిన్నటి వరకు చర్చ జరుగింది.అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం కొత్త జీవో రాబోతున్నట్టు తెలుస్తుంది.

అదే జరిగితే ప్రభాస్ రాధేశ్యామ్ నే ఫస్ట్ లబ్ది పొందే సినిమాగా కనిపిస్తుంది.

Telugu Ap Cm, Ap Cm Ys Jagan, Ap Ticket Rates, Bheemla Nayak, Ap, Pooja Hegde, P

రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న రాధేశ్యామ్ సినిమాలో బుట్ట బొమ్మ పూజా హెగ్డే హీరోయిన్ గా నటించింది.ప్రభాస్ ను వెండి తెర మీద చూడక దాదాపు మూడు సంవత్సరాలు అవుతుంది.అందుకే రాధేశ్యామ్ కోసం అభిమానులంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.ఈ సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో వరుస ఇంటర్వ్యూలు చేస్తూ క్షణం తీరిక లేకుండా గడుపుతున్నారు మేకర్స్.

Telugu Ap Cm, Ap Cm Ys Jagan, Ap Ticket Rates, Bheemla Nayak, Ap, Pooja Hegde, P

ఇక ఏపీలో టికెట్ ఇష్యుపై కొత్త జీవో ఈ వారం లోనే రాబోతుందట.అదే కనుక నిజం అయితే ప్రభాస్ రాధేశ్యామ్ సినిమాకు ఖచ్చితంగా ప్లస్ అవుతుందనే చెప్పాలి.అయితే ఈ విషయం తెలిసిన పీకే అభిమానులు మండిపడుతున్నారు.

భీమ్లా నాయక్ కోసమే ఈ జీవో రాకుండా అడ్డుకున్నారని విమర్శలు చేస్తున్నారు.అయితే ప్రభుత్వం మాత్రం గౌతమ్ రెడ్డి మృతి చెందడం వల్ల జీవో వాయిదా పడిందని చెప్పుకొస్తున్నారు.

ఏది ఏమైనప్పటికి ఈ భారీ బడ్జెట్ సినిమాకు కొత్త జీవో వస్తే లాభపడినట్టే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube