Samantha Khushi : ఖుషి సినిమా కూడా ప్లాఫ్ అంటున్న నెటిజన్స్.. సమంత అంటే అంతా కోపమా?

చూస్తుంటే సమంతను వదిలేలా లేరు జనాలు.ప్రతి విషయంలో ఆమెను బాగా టార్గెట్ చేస్తున్నారు కొందరు.

 Netizens Trolls On Samantha Khushi Movie Flop-TeluguStop.com

ఆమె మీద అంత పగ ఎందుకు పెంచుకున్నారో తెలియదు కానీ ఆమె గురించి ఏదైనా వార్త వస్తే చాలు వెంటనే నెగటివ్ గా స్పందిస్తున్నారు.ఇక వీళ్ళ కోపాలు చూస్తుంటే భవిష్యత్తులో సమంతను మొత్తం దించేయడం ఖాయమని తెలుస్తుంది.

Telugu Khushi, Khushi Poster, Myositis, Naga Chaitanya, Samantha, Samantha Troll

ఒకప్పుడు సమంత( Samantha ) అంటే ప్రతి ఒక్కరికి క్రష్ గా ఉండేది.కానీ ఇప్పుడు సమంత అంటే అందరూ బాగా ఫ్రస్టేషన్ అవుతున్నారు.అంతలా ఆమె ఏం పాపం చేసిందో కానీ ఆమె లైఫ్ తో మాత్రం ఆడుకుంటున్నారు జనాలు.నిజానికి ఆమె చేసింది ఏమీ లేదు.ఒక నాగచైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకొని విడాకులు తీసుకోవడం తప్ప.ఇక అప్పటినుంచి ఆమెను టార్గెట్ చేస్తూ వస్తున్నారు.

Telugu Khushi, Khushi Poster, Myositis, Naga Chaitanya, Samantha, Samantha Troll

నిజానికి నాగచైతన్య( Naga Chaitanya ), సమంత ఎందుకు విడాకులు తీసుకున్నారు తెలియదు.అసలు వారిద్దరి మధ్య ఏం జరిగిందో తెలియదు.వారిద్దరిలో ఒక హోదాలో ఉంది సమంత కాబట్టి.అందరూ సమంతనే తప్పు పట్టారు.ఇప్పటికీ సమంతదే తప్పు అంటున్నారు.కానీ అసలు విషయం మాత్రం బయటపడటం లేదు.

ఏం జరిగిందో తెలియదు కానీ జనాలు మాత్రం సమంతను టార్గెట్ చేయడం బాధాకరమని చెప్పాలి.

Telugu Khushi, Khushi Poster, Myositis, Naga Chaitanya, Samantha, Samantha Troll

విడాకుల( Divorce ) తర్వాత ఆమెకు సరైన గుర్తింపు కూడా అందివ్వలేకపోతున్నారు.విడాకుల తర్వాత సమంత ఒంటరిగా ఉంటూ ఎంతలా బాధపడిందో అది ఆమెకే తెలుసు.కొన్ని కొన్ని ఇంటర్వ్యూల ద్వారా ఆమె తను బాధపడిన విషయాన్ని బయటపెట్టే ప్రయత్నం కూడా చేసింది.

మధ్యలో ఆమెకు అరుదైన వ్యాధి రావటం కూడా బాధాకరమే.ఆ సమయంలో కూడా ఆమె ఒంటరిగానే పోరాటం చేసింది.
కానీ కొందరు మాత్రం అవేవీ పట్టించుకోకుండా.ప్రతి సారి ఆ విడాకుల రచ్చ తీసి ఆమెను మరింత బాధ పెడుతున్నారు.నిజానికి ఇప్పటివరకు చాలామంది సెలెబ్రెటీలు( Celebrities ) విడాకులు తీసుకున్న వాళ్ళు ఉన్నారు.కానీ సమంతను టార్గెట్ చేసినంత వాళ్లని ఎప్పుడు చేయలేదు.

అదేంటో అర్థం కాదు సమంత విషయంలో కూడా లైట్ తీసుకోవడం మానేసి ఆమెను మాత్రం బాధ పెడుతున్నారు.

Telugu Khushi, Khushi Poster, Myositis, Naga Chaitanya, Samantha, Samantha Troll

కనీసం సినిమాల పరంగా కూడా సపోర్ట్ చేయకుండా బాగా అతిగా చేస్తున్నారు.ఇక రీసెంట్గా విడుదలైన శాకుంతలం సినిమా( Shakunthalam ) కూడా విడుదల కాగా ఈ సినిమా కూడా ప్లాఫ్ అయింది.ఆమె సినిమా అంటేనే చూడటానికి ఇష్టపడటం లేదు కొందరు జనాలు.

ఇప్పుడు ఆమె విజయ్ దేవరకొండ తో కలిసి ఖుషి సినిమా( Khushi )లో నటిస్తుంది.

Telugu Khushi, Khushi Poster, Myositis, Naga Chaitanya, Samantha, Samantha Troll

ఇక నిన్న తన పుట్టినరోజు సందర్భంగా ఆ సినిమాకు సంబంధించిన కొన్ని అప్డేట్లను కూడా వదిలారు సినీ బృందం.యూట్యూబ్ లో ఒక వీడియో కూడా షేర్ చేశారు.అయితే ఆ సినిమా కూడా ప్లాఫ్ అంటూ కొందరు సమంతను టార్గెట్ చేయడం మొదలుపెట్టారు.

అంతేకాకుండా ఆమెను బాగా తిట్టిపోస్తున్నారు.ఆ సినిమా రాకముందే ప్లాఫ్ అని.చూడాలన్న ప్రేక్షకులకు కూడా ఇంట్రెస్ట్ లేకుండా చేస్తున్నారు కొందరు.దీంతో సమంత అభిమానులు.

హేటర్స్ పై బాగా ఫైర్ అవుతున్నారు.ఎందుకు ఆమె అంటే అంత కోపం.

ఆమె నచ్చకపోతే ఆమె గురించి మాట్లాడకండి.కానీ ప్రతిసారి ఆమె గురించి టాపిక్ తీస్తూ ఆమెను ఎందుకలా బాధ పెడుతున్నారు అంటూ ప్రశ్నిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube