హెచ్ 1 బీ దరఖాస్తుదారులను( H1B Visa ) ఎంపిక చేసేందుకు ఉద్దేశించిన కంప్యూటరైజ్డ్ లాటరీ సిస్టమ్‌పై సంచలన వ్యాఖ్యలు చేసింది యూఎస్ సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (యూఎస్‌సీఐఎస్) .ఈ సిస్టమ్‌ను దుర్వినియోగం చేయడంతో పాటు మోసాలు సైతం పెరిగాయని ఏజెన్సీ శుక్రవారం తెలిపింది.2023-24 ఆర్ధిక సంవత్సరానికి గాను హెచ్1 బీ క్యాప్ దరఖాస్తుల ద్వారా వచ్చిన సాక్ష్యాధారాల ఆధారంగా యూఎస్‌సీఐఎస్( US Citizenship and Immigration Services ) ఇప్పటికే విస్తృతమైన విచారణను చేపట్టింది.అలాగే కొన్ని పిటిషన్లను తిరస్కరించడంతో పాటు ఉపసంహరించుకున్నట్లు పేర్కొంది.
అంతేకాకుండా క్రిమినల్ ప్రాసిక్యూషన్ కోసం లా ఎన్‌ఫోర్స్‌మెంట్ రెఫరల్‌ను ప్రారంభించే ప్రక్రియలో ఏజెన్సీ వుంది.
హెచ్1 బీ ప్రోగ్రామ్ అమెరికన్ ఇమ్మిగ్రేషన్, ఆర్ధిక వ్యవస్థలో ముఖ్య భాగమని యూఎస్‌సీఐఎస్ పేర్కొంది.యూఎస్ లేబర్ మార్కెట్‌కు( US Labor Market ) మారుతున్న అవసరాలను తీర్చడంలోనూ ఈ వ్యవస్థ కట్టుబడి వుందని ఏజెన్సీ చెప్పింది.తాము రాబోయే రోజుల్లో హెచ్ 1బీ ప్రోగ్రామ్‌ను ఆధునీకీకరిస్తామని.దీని వల్ల హెచ్ 1 బీ రిజిస్ట్రేషన్ సిస్టమ్‌లో దుర్వినియోగం, మోసాలు తగ్గడానికి వీలు కలుగుతుందని పేర్కొంది.2024 ఆర్ధిక సంవత్సరానికి గాను హెచ్ 1 బీ క్యాప్ రిజిస్ట్రేషన్ల సంఖ్యలో గతేడాదితో పోలిస్తే గణనీయమైన పెరుగుదల కనిపించిందని యూఎస్‌సీఐఎస్ తెలిపింది.2023లో 4,83,927.2022లో 3,01,447.2021లో 2,74,237 దరఖాస్తులు రాగా.ఈ ఏడాది కంప్యూటరైజ్డ్ లాటరీలో( Computerized Lottery ) హెచ్-1బీ వీసాల కోసం 7,80,884 దరఖాస్తులు వచ్చాయని పేర్కొంది.
ఇదిలావుండగా.అక్టోబర్ 1 నుంచి ప్రారంభమయ్యే ఆర్ధిక సంవత్సరానికి గాను హెచ్ 1 బీ వీసా దరఖాస్తులు నిర్ణీత పరిమితికి (క్యాప్) చేరుకున్నాయని ఈ ఏడాది మార్చిలో యూఎస్‌సీఐఎస్ తెలిపింది.ఈ విషయాన్ని దరఖాస్తుదారులకు తెలియజేసినట్లు వెల్లడించింది.నాటి ప్రకటనను అనుసరించి హెచ్1 బీ క్యాప్‌కు తగినన్ని ఎలక్ట్రానిక్ రిజిస్ట్రేషన్‌లను పొందినట్లు తెలిపింది.ఎంపిక చేసిన రిజిస్ట్రేషన్‌లు కలిగిన పిటిషనర్లు 2024 ఆర్ధిక సంవత్సరానికి హెచ్ 1 బీ క్యాప్ సబ్జెక్ట్ పిటిషన్‌లను దాఖలు చేయవచ్చని వెల్లడించింది.యూఎస్ కాంగ్రెస్ హెచ్ 1 బీ కేటగిరీకి ప్రస్తుతం వార్షిక రెగ్యులర్ క్యాప్‌ను 65000గా నిర్ణయించింది.
ఇందులో 6800 వీసాలు యూఎస్ – చిలీ, యూఎస్- సింగపూర్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలను అమలు చేసే చట్టపరమైన నిబంధనల ప్రకారం పక్కనపెట్టారు.ఒకవేళ ఇందులో ఏవైనా వీసాలు మిగిలిపోతే వాటిని వచ్చే ఆర్ధిక సంవత్సరం రెగ్యులర్ హెచ్ 1 బీ క్యాప్ కోసం అందుబాటులోకి తీసుకొస్తారు.