హెచ్ 1 బీ లాటరీ సిస్టమ్‌లో మోసాలు : ప్రభుత్వానికి యూఎస్ ఇమ్మిగ్రేషన్ ఏజెన్సీ హెచ్చరిక

హెచ్ 1 బీ దరఖాస్తుదారులను( H1B Visa ) ఎంపిక చేసేందుకు ఉద్దేశించిన కంప్యూటరైజ్డ్ లాటరీ సిస్టమ్‌పై సంచలన వ్యాఖ్యలు చేసింది యూఎస్ సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (యూఎస్‌సీఐఎస్) .

ఈ సిస్టమ్‌ను దుర్వినియోగం చేయడంతో పాటు మోసాలు సైతం పెరిగాయని ఏజెన్సీ శుక్రవారం తెలిపింది.

2023-24 ఆర్ధిక సంవత్సరానికి గాను హెచ్1 బీ క్యాప్ దరఖాస్తుల ద్వారా వచ్చిన సాక్ష్యాధారాల ఆధారంగా యూఎస్‌సీఐఎస్( US Citizenship And Immigration Services ) ఇప్పటికే విస్తృతమైన విచారణను చేపట్టింది.

అలాగే కొన్ని పిటిషన్లను తిరస్కరించడంతో పాటు ఉపసంహరించుకున్నట్లు పేర్కొంది.అంతేకాకుండా క్రిమినల్ ప్రాసిక్యూషన్ కోసం లా ఎన్‌ఫోర్స్‌మెంట్ రెఫరల్‌ను ప్రారంభించే ప్రక్రియలో ఏజెన్సీ వుంది.

"""/" / హెచ్1 బీ ప్రోగ్రామ్ అమెరికన్ ఇమ్మిగ్రేషన్, ఆర్ధిక వ్యవస్థలో ముఖ్య భాగమని యూఎస్‌సీఐఎస్ పేర్కొంది.

యూఎస్ లేబర్ మార్కెట్‌కు( US Labor Market ) మారుతున్న అవసరాలను తీర్చడంలోనూ ఈ వ్యవస్థ కట్టుబడి వుందని ఏజెన్సీ చెప్పింది.

తాము రాబోయే రోజుల్లో హెచ్ 1బీ ప్రోగ్రామ్‌ను ఆధునీకీకరిస్తామని.దీని వల్ల హెచ్ 1 బీ రిజిస్ట్రేషన్ సిస్టమ్‌లో దుర్వినియోగం, మోసాలు తగ్గడానికి వీలు కలుగుతుందని పేర్కొంది.

2024 ఆర్ధిక సంవత్సరానికి గాను హెచ్ 1 బీ క్యాప్ రిజిస్ట్రేషన్ల సంఖ్యలో గతేడాదితో పోలిస్తే గణనీయమైన పెరుగుదల కనిపించిందని యూఎస్‌సీఐఎస్ తెలిపింది.

2023లో 4,83,927.2022లో 3,01,447.

2021లో 2,74,237 దరఖాస్తులు రాగా.ఈ ఏడాది కంప్యూటరైజ్డ్ లాటరీలో( Computerized Lottery ) హెచ్‌-1బీ వీసాల కోసం 7,80,884 దరఖాస్తులు వచ్చాయని పేర్కొంది.

"""/" / ఇదిలావుండగా.అక్టోబర్ 1 నుంచి ప్రారంభమయ్యే ఆర్ధిక సంవత్సరానికి గాను హెచ్ 1 బీ వీసా దరఖాస్తులు నిర్ణీత పరిమితికి (క్యాప్) చేరుకున్నాయని ఈ ఏడాది మార్చిలో యూఎస్‌సీఐఎస్ తెలిపింది.

ఈ విషయాన్ని దరఖాస్తుదారులకు తెలియజేసినట్లు వెల్లడించింది.నాటి ప్రకటనను అనుసరించి హెచ్1 బీ క్యాప్‌కు తగినన్ని ఎలక్ట్రానిక్ రిజిస్ట్రేషన్‌లను పొందినట్లు తెలిపింది.

ఎంపిక చేసిన రిజిస్ట్రేషన్‌లు కలిగిన పిటిషనర్లు 2024 ఆర్ధిక సంవత్సరానికి హెచ్ 1 బీ క్యాప్ సబ్జెక్ట్ పిటిషన్‌లను దాఖలు చేయవచ్చని వెల్లడించింది.

యూఎస్ కాంగ్రెస్ హెచ్ 1 బీ కేటగిరీకి ప్రస్తుతం వార్షిక రెగ్యులర్ క్యాప్‌ను 65000గా నిర్ణయించింది.

ఇందులో 6800 వీసాలు యూఎస్ - చిలీ, యూఎస్- సింగపూర్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలను అమలు చేసే చట్టపరమైన నిబంధనల ప్రకారం పక్కనపెట్టారు.

ఒకవేళ ఇందులో ఏవైనా వీసాలు మిగిలిపోతే వాటిని వచ్చే ఆర్ధిక సంవత్సరం రెగ్యులర్ హెచ్ 1 బీ క్యాప్ కోసం అందుబాటులోకి తీసుకొస్తారు.

దేవర సినిమాకు నెగిటివ్ రివ్యూ ఇవ్వమని డబ్బులు ఇచ్చారు….పూల చొక్కా నవీన్ షాకింగ్ కామెంట్స్!