సంక్రాంతికి రిలీజ్ కానున్న పెద్ద సినిమాలలో ఒకటైన వారసుడు మూవీ నుంచి తాజాగా థియేట్రికల్ ట్రైలర్ విడుదలైంది.అయితే ఈ ట్రైలర్ ను చూసిన ప్రేక్షకులు ట్రైలర్ కొత్తగా లేదని రొటీన్ గా ఉందని కామెంట్లు చేస్తున్నారు.
టాలీవుడ్ హిట్ సినిమాలపైన పలు సినిమాలను మిక్స్ చేస్తే వారసుడు ట్రైలర్ లా ఉందని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.వారసుడు మూవీ అంచనాలను అందుకోవడం తేలిక కాదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
దర్శకుడు వంశీ పైడిపల్లి మహేష్ తో తెరకెక్కించిన మహర్షి సినిమా హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే.ఆ సినిమాకు కొన్ని మార్పులు చేసి వారసుడు మూవీని తెరకెక్కించినట్టు కామెంట్లు వినిపిస్తున్నాయి.
సరైనోడు, బ్రహ్మోత్సవం, అల వైకుంఠపురములో సినిమాలను గుర్తు చేసేలా ఈ సినిమా ట్రైలర్ ఉండటం గమనార్హం.ట్రైలర్ లోని కొన్ని షాట్స్ అత్తారింటికి దారేది, అజ్ఞాతవాసి సినిమాలను గుర్తు చేస్తున్నాయి.
వారసుడు సినిమా తమిళంలో హిట్టైనా తెలుగు ప్రేక్షకులను మాత్రం మెప్పించడం కష్టమని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.మరోవైపు విజయ్ కూడా వారసుడు సినిమాతో కచ్చితంగా సక్సెస్ ను సొంతం చేసుకోవాల్సి ఉంది.వారసుడు సినిమాకు దిల్ రాజు ఊహించని స్థాయిలో ఖర్చు చేశారని ప్రచారం జరుగుతోంది.విజయ్ ఈ సినిమాతో తెలుగులో మార్కెట్ ను పెంచుకోవాలని భావిస్తున్నారు.
ఈ మధ్య కాలంలో ఫ్యామిలీ కథాంశాలతో తెరకెక్కిన సినిమాలు సక్సెస్ సాధిస్తున్నా ఆ సినిమాలు కమర్షియల్ గా అద్భుతాలు చేయడం లేదు.అయితే దిల్ రాజు మాత్రం వారసుడు మూవీ కథపై నమ్మకాన్ని కలిగి ఉన్నారు.ఈ సినిమా ఆయన నమ్మకాన్ని నిజం చేస్తుందో లేదో చూడాల్సి ఉంది.వారసుడు మూవీ ఏకంగా 250 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో తెరకెక్కిందని సమాచారం.