నందమూరి మోక్షజ్ఞ( Nandamuri Mokshagna ) సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి స్టార్ స్టేటస్ ను సొంతం చేసుకోవడంతో పాటు వరుస విజయాలను అందుకోవాలని నందమూరి ఫ్యాన్స్ ఆకట్టుకుంటున్నారు.ప్రతి సంవత్సరం మోక్షజ్ఞ ఎంట్రీ గురించి వార్తలు ప్రచారంలోకి రావడం, వేర్వేరు కారణాల వల్ల మోక్షజ్ఞ ఎంట్రీ ఆలస్యం కావడం జరుగుతోంది.
అయితే సరైన సమయంలోనే మోక్షజ్ఞ సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తారని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.ఆదిత్య 999 మ్యాక్స్( Aditya 999 Max ) సినిమాతో మోక్షజ్ఞ సినిమాల్లోకి వస్తారని ప్రచారం జరిగినా ప్రస్తుతం కమర్షియల్ ప్రాజెక్ట్ తో మోక్షజ్ఞ ఎంట్రీ ఉండే ఛాన్స్ ఉందని ప్రచారం జరుగుతోంది.

మోక్షజ్ఞ లేటెస్ట్ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుండగా మ్యాన్లీ లుక్( Mokshagna New look ) లో మోక్షజ్ఞ అదుర్స్ అనిపిస్తున్నారని ఫ్యాన్స్ నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.మరి కొందరు మోక్షజ్ఞ ఫస్ట్ మూవీలో ఇదే లుక్ లో కనిపిస్తారని చెబుతున్నారు.బాలయ్య లేదా మోక్షజ్ఞ అధికారికంగా క్లారిటీ ఇస్తే మాత్రమే మోక్షజ్ఞ సినీ ఎంట్రీ గురించి పూర్తిస్థాయిలో క్లారిటీ వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి.లుక్ ను పూర్తిగా మార్చేసుకున్న మోక్షజ్ఞ ఫిట్ గా కనిపిస్తూ బ్లాక్ డ్రెస్ లో ఆకట్టుకుంటున్నారు.
మోక్షజ్ఞ లేటెస్ట్ ఫోటోలతో ప్రస్తుతం సోషల్ మీడియా( Social media ) షేక్ అవుతోంది.బాలయ్య తన లుక్స్ తో అన్నలకు గట్టి పోటీ ఇస్తున్నాడని నందమూరి ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.

ఏపీ ఎన్నికలు పూర్తైతే మోక్షజ్ఞ ఎంట్రీ( Mokshagna Cine Entry ) గురించి క్లారిటీ వస్తుందని పాన్ ఇండియా స్థాయిలో మోక్షజ్ఞ సక్సెస్ అవుతారని ఫ్యాన్స్ నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి.బాలయ్య( Balakrishna ) నుంచి గ్రీన్ సిగ్నల్ లభిస్తే మోక్షజ్ఞతో సినిమాలను తెరకెక్కించడానికి సిద్ధమేనని పలువురు స్టార్ డైరెక్టర్లు చెబుతున్నారు.మోక్షజ్ఞ ఫస్ట్ మూవీ సంథింగ్ స్పెషల్ గా ఉండాలని ఫ్యాన్స్ ఫీలవుతుండటం గమనార్హం.మోక్షజ్ఞ ఫస్ట్ మూవీ సొంత బ్యానర్ లో అక్క తేజస్విని నిర్మాతగా తెరకెక్కనుందని తెలుస్తోంది.
మోక్షజ్ఞ బాక్సాఫీస్ వేటకు సిద్ధం కావాలంటూ కొంతమంది సోషల్ మీడియా వేదికగా సరదాగా కామెంట్లు చేస్తున్నారు.