Saudi Badminton Competition : సౌదీ మెచ్చిన నెల్లూరు కుర్రాడు...ఘనంగా సన్మానించిన భారత ఎంబసీ...!!

సౌదీ అరేబియా చరిత్రలో తనకంటూ ఓ పేజీని సృష్టించుకున్నాడు ఏపీ కి చెందిన నెల్లూరు జిల్లా యువకుడు.సౌదీ లో జరుగుతున్న జాతీయ క్రీడలలో బ్యాడ్మింటన్ పోటీలో అందరిని ఓడించి విజయాన్ని సాధించాడు.అంతేకాదు అతడి ప్రతిభను మెచ్చిన సౌదీ ప్రభుత్వం అతడికి రూ.2 కోట్ల బహుమతి తో పాటు అరుదైన శాశ్వత పౌరసత్వ హక్కును కూడా కల్పించింది.ఆ యువకుడు పేరు మహాద్.తల్లి తండ్రులతో పాటు సౌదీ లోనే ఉంటున్న మహాద్ అక్కడే విద్యను అభ్యసిస్తున్నాడు.

 Nellore Resident Mohammed Mehad Shah Won Gold Medal Saudi Badminton Competition,-TeluguStop.com

బ్యాడ్మింటన్ లో సత్తా చాటాలని అందరి ప్రశంసలు అందుకోవాలని అనుకునే వాడిని అందుకు తగ్గట్టుగా హైదరాబాదు గోపీచంద్ బ్యాడ్మింటన్ అకాడమిలో శిక్షణ కూడా తీసుకున్నట్టుగా మహాద్ తెలిపాడు.గోపీచంద్ అకాడమి లో నేర్చుకున్న మెళకువలు నాకు ఎంతో ఉపయోగపడ్డాయని తెలిపాడు.

తన విజయానికి తల్లి తండ్రుల సహకారం మరువలేనిదని, తనకు అన్ని రకాలుగా సహకరిస్తున్న తన పాటశాల కు కూడా కృతజ్ఞతలు తెలిపాడు మహద్.ఇదే పోటీలలో బాలికల విభాగం తరుపున కేరళ కు చెందిన ఖదీజా అనే బాలిక కూడా స్వర్ణం గెలుచుకుని రికార్డ్ సృష్టించింది.ఇదిలాఉంటే

Telugu Badminton, Indian Embassy, Kadeeja Kothoor, Kerala, Mohammedmehad, Nellor

సౌదీ జాతీయ క్రీడల్లో అత్యంత చక్కనైన ప్రతిభ కనబరించిన మహాద్ ను భారత ప్రభుత్వం తరుపున రియాద్ లోని భారత ఎంబసీ ఘనంగా సత్కరించింది.బాలికల విభాగంలో స్వర్ణం గెలిచిన ఖదీజా ను కూడా భారత ఎంబసీ సన్మానించింది.అక్కడి భారత రాయభారి రాంప్రసాద్ ఇరువురికి శాలువాలు కప్పి సన్మానించి, జ్ఞాపికలు అందించారు.ఈ కార్యక్రమానికి విజేతల తల్లి తండ్రులు హాజరు కాగా, వారి పాటశాలల ప్రిన్సిపాల్, టీచర్స్ , కోచ్ లు కూడా హాజరయ్యారు కాగా భవిష్యత్తు లో జరగబోయే ఒలంపిక్స్ లో సౌదీ అరేబియా ప్రభుత్వం తరుపున ఆడి విజయం సాదించడం తన లక్ష్యమని తెలిపాడు.

కాగా తనను సత్కరించిన భారత ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube