ఒక్క ఫోటోకి మైక్రో సాఫ్ట్ అధినేత బ్లాంక్ చెక్ ఇచ్చేశాడంటే నమ్మబుద్ధి కావడం లేదు కదూ.కానీ ఇది అక్షరాలా నిజం.
అవును, సుమారుగా ఓ 3 దశాబ్దాల నుంచి కంప్యూటర్ యుగాన్ని శాసిస్తున్న ఏకైక సాఫ్ట్ వేర్ పేరు ఏదన్న వుంది అంటే, అది విండోస్ మాత్రమే.విండోస్ కంప్యూటర్లకు నేడు ప్రపంచవ్యాప్తంగా ఎంత డిమాండ్ వుందో ఆశ్చర్యం పడవలసిన అవసరం లేదు.
మైక్రోసాఫ్ట్ ఆధీనంలోని విండోస్ ఎప్పటికప్పుడు తన వినియోగదారులకు సరికొత్తగా అప్డేట్ అవుతూ, వారి అవసరాలకి అనుగుణంగా మారుతూ ఉంటుంది.
విండోస్ కంప్యూటర్ సెక్యూరిటి విషయంలో ఎంత పటిష్టంగా ఉంటుందో చెప్పాల్సిన పనిలేదు.
చాలా మంది కంప్యూటర్ వాడే వాళ్లకు విండోస్ మినహా మరొక సాఫ్ట్ వేర్ తెలియదు అంటే అతిశయోక్తిగా ఉంటుంది.కానీ ఇది నిజం.యాపిల్ కంపెనీ నుంచి వచ్చిన సాఫ్ట్ వేర్ కూడా ఆ రేంజ్ లో పాపులర్ కాకపోవడం కొసమెరుపు.ఆ కంప్యూటర్లలో కూడా విండోస్ వాడటం గమనించవచ్చు.
ఇక ఇదిలా ఉంటె ఈ విండోస్ సాఫ్ట్ వేర్ కి ఒక సిగ్నేచర్ ఫోటో ఉంటుంది.ఆ ఫోటోని చూడని మనిషి ఉండదు.

ఇప్పటి తరం స్క్రీన్ మీద తమకి నచ్చిన ఫోటోలను పెట్టుకుంటున్నారు కానీ, ఒకప్పుడు విండోస్ అంటే ఒకే ఫోటో మాత్రమే ఉండేది.ఒక వ్యాలీలో పచ్చదనం, ఆకాశం కనపడేలా ఒక ఫోటో గ్రాఫర్ తీసిన ఫోటో అది.కంప్యూటర్ వాడే వాళ్ళకు దీనిగురించి బాగా తెలుసు.ప్రపంచంలో ఎక్కువ మంది చూసిన ఈ ఫోటోని చార్లెస్ అనే వ్యక్తి తన కెమెరాలో బంధించగా, సదరు ఫోటో చూసిన బిల్ గేట్స్ ఆ వ్యక్తిని… నువ్వు జీవితంలో సెటిల్ అవ్వడానికి కావాల్సినంత రాసుకో! అని తనదగ్గరున్న బ్లాంక్ చెక్ ఇచ్చి దాని మీద సంతకం చేసి ఇచ్చారట.
అలా 2002 నుంచి విండోస్ కి ఆ ఫోటోనే పరిమితం అయిపోయింది.







