టాలీవుడ్ దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్,జూనియర్ ఎన్టీఆర్ లు కలిసి నటించిన చిత్రం ఆర్‌ఆర్‌ఆర్.ఈ ఏడాది మార్చి 25న విడుదలైన ఈ సినిమా ఏ రేంజ్ లో విజయాన్ని అందుకుందో మనందరికీ తెలిసిందే.
భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా ఊహించని విధంగా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకోవడమే కాకుండా కలెక్షన్ల వర్షం కురిపించింది.ఈ సినిమా విడుదల అయ్యి ప్రపంచవ్యాప్తంగా 1100 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి రికార్డులను సృష్టించింది.
ప్రేక్షకుల అంచనాలకు మించి ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.ఈ సినిమాతో ఇద్దరు స్టార్ లు పాన్ ఇండియా స్టార్ లుగా మారిన విషయం తెలిసిందే.
ఇకపోతే ఈ సినిమాలో విజువల్ ఎఫెక్ట్స్, మ్యూజిక్, యాక్టింగ్ ఇలా అన్ని కోణాల్లో తిరుగులేదు అనిపించాయి.ఇకపోతే ఈ సినిమా ఇటీవలే ఓటీటీ లో విడుదల విషయం తెలిసిందే.జీ5లో తెలుగు, కన్నడ, మలయాళం, తమిళ్ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది.అలాగే హిందీ వెర్షన్ నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన అయిన తెలిసిందే.
ఇక పోతే ఈ సినిమాలో ఇద్దరు హీరోల నటన విషయానికి వస్తే.ఇద్దరూ ఇందులో అద్భుతంగా నటించారు అని చెప్పవచ్చు.
ఈ సినిమాను చూసిన తర్వాత సినీ ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఇద్దరు హీరోలపై ప్రశంసల వర్షం కురిపించారు.మరి ముఖ్యంగా ఇందులో ఇంటర్వెల్ సీన్ సినిమాకే హైలెట్‌గా నిలిచింది అని చెప్పవచ్చు.
ఆ సమయంలో రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ ల మధ్య వచ్చే పోరాటం, వారు పలికించే హావాభావాలు ప్రేక్షకులను ఎమోషనల్‌గా కట్టిపడేశాయి.అయితే ఇదే ఫైటింగ్ సిగ్నల్స్ ను ఇప్పటికే ఎంతోమంది రీ క్రియేట్ చేసి అందుకు సంబంధించిన నీడను సోషల్ మీడియాలో షేర్ చేశారు.తాజాగా ఈ సినిమాలోని ఫైటింగ్ సీక్వెన్స్‌ను నెల్లూరు కుర్రాళ్లు అనే యూట్యూబ్ ఛానెల్ యువకులు రీ క్రియేట్ చేశారు.ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
ఈ ఛానెల్ నుంచి ఇదివరకు వచ్చిన వకీల్ సాబ్, పుష్ప, క్రాక్, భీమ్లా నాయక్ సినిమాల్లోని సన్నివేశాల రీ క్రియేట్ వీడియోలు ప్రశంసలు అందుకున్నాయి.ఆర్ఆర్ఆర్ కి సంబంధించిన సీక్వెన్స్ ని చూసిన అభిమానులు వారిపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.