తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు.ఇవాళ వేకువజామున స్వామి వారి అభిషేక సేవలో కుటుంబ సమేతంగా తెలంగాణ మంత్రి హరీష్, ఏపి దేవదాయ శాఖా ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్, ఏపి సమాచార శాఖా మంత్రి చెల్లుబోయినా వేణుగోపాల్ కృష్ణ లు వేర్వేరుగా స్వామి వారి సేవలో పాల్గోని మొక్కులు చెల్లించుకున్నారు.
అనంతరం వీరికి ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా, ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామి వారి తీర్ధ ప్రసాదాలు అందజేశారు.అనంతరం ఆలయ వెలుపలకు వచ్చిన ఏపి మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్ కృష్ణ మీడియాతో మాట్లాడుతూ.
రాష్ట్రంలో పేదరికం నశింప జేసేందుకు పాలకుడిగా జగన్ అయ్యాడని, పేదలను కాపాడేందుకే నిత్యం ఆలోచన సీఎం జగన్ ఉన్నారని మంత్రి కొనియాడారు.
వారి జీవితాల్లో మార్పు కోసం అనేక సంక్షేమ పధకాలు ప్రవేశ పెట్టారని, పేదలకు ప్రధానమైనది విద్యా, పేద ప్రజలకు విద్య అందుబాటులో ఉండేలా నాడు నేడు కార్యక్రమాన్ని ప్రవేశ పెట్టారని చెప్పారు.
పేదలు వైద్యం చేసుకొనేలా ఆరోగ్య శ్రీ అమలు చేసారని, ప్రతిపక్షాలు పేదవాడిని మరింత పేదవాడు కావాలని కోరుతున్నారని, కష్టాలన్నీ తొలగించి, సీఎం జగన్ పై అనుగ్రహం ఉంచాలని స్వామి వారిని కోరుకున్నట్లు ఆయన చెప్పారు.మా లక్ష్యం ప్రజలకు సేవ చేయడమేనని ఏపి మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్ కృష్ణ అన్నారు.