నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నారు.అఖండ సినిమా వంటి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న బాలకృష్ణ తన తదుపరి చిత్రాన్ని గోపీచంద్ మలినేని దర్శకత్వంలో చేస్తున్నారు.
ప్రస్తుతం ఈ సినిమా NBK 107అనే వర్కింగ్ టైటిల్ తో షూటింగ్ పనులను జరుపుకుంటుంది ఇకపోతే ఈ సినిమాకు నేడు (అక్టోబర్ 21) కర్నూలులోని కొండారెడ్డి బురుజు వద్ద ఈ సినిమా టైటిల్ అనౌన్స్ చేయనున్నట్లు వెల్లడించారు.ఈ సినిమాకు దాదాపు రెడ్డి గారు అనే టైటిల్ కన్ఫర్మ్ అయినట్టు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.
ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల చేస్తున్న పోస్టర్లు టీజర్ పెద్ద ఎత్తున సినిమాపై అంచనాలను పెంచాయి.క్రాక్ వంటి సూపర్ హిట్ సినిమా తర్వాత బాలకృష్ణ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఈ సినిమా చేయడంతో సినిమాపై కూడా భారీ అంచనాలు పెరిగాయి.
ఇకపోతే ఈ సినిమా ఇదివరకు షెడ్యూల్ టర్కీలో పూర్తి చేసుకుని వచ్చారు.ఇక ఈ సినిమాలో బాలయ్య సరసన శృతిహాసన్ నటిస్తున్నారు.ఇక నేడు సాయంత్రం 8 గంటలకు ఈ సినిమా టైటిల్ ప్రకటించనున్నారని తెలియడంతో ఈ విషయంపై పెద్ద ఎత్తున అభిమానులలో ఆత్రుత నెలకొంది.

ఇకపోతే తాజాగా బాలకృష్ణ NBK 107 సినిమాకి సంబంధించి మరో అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఈ సినిమా శాటిలైట్ హక్కులను ప్రముఖ టీవీ ఛానల్ స్టార్ మా భారీ ధరలకు కైవసం చేసుకుందనే వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఇలా బాలకృష్ణ సినిమాపై నమ్మకంతోనే స్టార్ మా భారీ ధరలకు ఈ సినిమా హక్కులను కొనుగోలు చేసినట్టు సమాచారం మరి ఈ వార్తలలో ఎంతవరకు నిజముందో తెలియదు కానీ ఈ వార్త వైరల్ అవుతుంది.
మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో ఈ సినిమా ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.