లేడీ సూపర్ స్టార్ గా ఎంత పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి నయనతార ( Nayanthara ) గత ఏడాది వివాహం చేసుకొని వైవాహిక జీవితంలో అడుగుపెట్టిన సంగతి మనకు తెలిసిందే.ఇక ఈమె డైరెక్టర్ విగ్నేష్ శివన్(విఘ్నేష్ శివన్)ని వివాహం చేసుకున్నారు.
అయితే పెళ్లి తర్వాత ఈ దంపతులు నాలుగు నెలలకే సరోగసి వల్ల ఇద్దరు కవల పిల్లలకు తల్లిదండ్రులు అయ్యారు.ఈ మధ్యకాలంలో నయనతర తన పిల్లల అభిమానులతో పంచుకొని పెద్ద ఎత్తున సందడి చేస్తున్నారు.
తాజాగా మరోసారి తన ఇద్దరు కవల పిల్లలతో నయనతార భర్త విగ్నేష్ సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు.
చిన్ని కృష్ణుడి జన్మాష్టమి సందర్భంగా లేడీ సూపర్ స్టార్ నయనతార, డైరెక్టర్ విఘ్నేశ్ శివన్( Director Vignesh Shivan ) దంపతులు మొదటి సారి తమ కవల పిల్లల ఉయిర్, ఉలగ్ ఫొటోను షేర్ చేశారు.ఇలా తమ పిల్లలతో కలిసి వారికి ఇది మొదటి జన్మాష్టమి కావడంతో ఈ దంపతులు తమ ఇద్దరు పిల్లలకు కృష్ణుడి వేషం వేసి కృష్ణాష్టమి ( Krishnashtami )వేడుకలను ఎంతో ఘనంగా జరుపుకున్నారని తెలుస్తోంది.ఈ క్రమంలోనే ఇందుకు సంబంధించిన ఫోటోలను షేర్ చేశారు.అయితే పిల్లల ఫేస్ కనపడకుండా వీరు దేవుడి గది వద్దకు వెళ్లి నమస్కరిస్తూ ఉన్నటువంటి ఫోటోలను అభిమానులతో పంచుకుంటూ కృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలియజేశారు
ఇక ఈ ఫోటోలను డైరెక్టర్ విగ్నేష్ ఇన్స్టాగ్రామ్ ద్వారా షేర్ చేస్తూ…ఇద్దరు కృష్ణులతో( uyir Ulag ) ఎంతో అందమైన కృష్ణ జయంతిని, ఆశీర్వచనాల మధ్య జరుపుకుంటున్నాం.అందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు.మీరు కూడా మీ కుటుంబాలు, స్నేహితులతో పండుగ జరుపుకుంటున్నారని ఆశిస్తున్నాం అంటూ ఈ ఫోటోలను షేర్ చేయడంతో ఇవి కాస్త వైరల్ వైరల్ అవుతున్నాయి.ఇకపోతే తాజాగా నయనతార నటించిన జవాన్( Jawan ) సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే.
ఈ సినిమా సూపర్ హిట్ అందుకొని ప్రేక్షకులను సందడి చేస్తోంది.ఈ సినిమా ద్వారా నయనతార బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు.