ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ సినిమా తో హీరోగా తెలుగు వారికి పరిచయం అయిన యంగ్ స్టార్ నవీన్ పొలిశెట్టి తాజాగా జాతి రత్నాలు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.మొదటి సినిమా తో ప్రతిభ ఉన్న నటుడు అనిపించుకున్న నవీన్ తాజ జాతిరత్నాలు సినిమాతో స్టార్ హీరో అయ్యే రేంజ్ ఉన్న హీరో అంటూ ప్రశంసలు దక్కించుకున్నాడు.
జాతి రత్నాలు సినిమాలో ఆయన నటన మరో రేంజ్ లో ఉండి ప్రేక్షకులను నవ్వించడం జరిగింది.జాతి రత్నాలు సినిమా మరో రేంజ్ లో ఉండటం వల్ల సినిమాకు భారీ ఎత్తున వసూళ్లు నమోదు అవుతున్నాయి.
దాంతో నవీన్ తదుపరి సినిమా గురించి అప్పుడే చర్చలు మొదలు అయ్యాయి.ఈ సమయంలో ఆయన తదుపరి సినిమా ఏంటా అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పుకార్లు షికార్లు చేస్తున్నాయి.
ఈ సమయంలో మాకు అందుతున్న సమాచారం ప్రకారం నవీన్ పొలిశెట్టి తదుపరి సినిమాను నిర్మించేందుకు యూవీ క్రియేషన్స్ వారు ఇప్పటికే ఒప్పందం చేసుకున్నారట.యూవీ క్రియేషన్స్ వారు జాతి రత్నాలు విడుదల కాకముందే అడ్వాన్స్ ఇచ్చారని సమాచారం అందుతోంది.
ఇక ఇటీవల సీతార ఎంటర్ టైన్ మెంట్స్ వారు కూడా నవీన్ పొలిశెట్టికి అడ్వాన్స్ ఇచ్చి బుక్ చేశారు.ఈ రెండు పెద్ద బ్యానర్ లే అవ్వడం వల్ల భారీ సినిమా లు రావడం ఖాయంగా కనిపిస్తుంది.
వరుసగా మంచి సినిమాలను తీస్తున్న ఈ రెండు బ్యానర్ లలో నవీన్ పొలిశెట్టి సినిమా లు చేయడం వల్ల ఆయన రేంజ్ మరింత పెరగడం ఖాయం.ఈ రెండు సినిమా లకు దర్శకులు ఎవరు అనే విషయమై త్వరలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
పెద్ద ఎత్తున నవీన్ పొలిశెట్టిపై అంచనాలు ఉన్నాయి.కనుక ఆయన ఆచితూచి కథలను ఎంపిక చేసుకుంటే బాగుంటుందని ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు.