తెలుగు, తమిళ భాషల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు డైరెక్టర్ శివ.ప్రస్తుతం ఈయన రజనీ కాంత్ తో ఒక సినిమాను చేయబోతున్నాడు.
ఈ సినిమా కరోనా తర్వాత డిసెంబర్ నెలలో మొదలైనప్పటికీ చిత్ర యూనిట్ లో కొంత మందికి కరోనా రావడంతో అప్పుడు వాయిదా పడింది.అయితే మళ్ళీ ఇన్ని రోజులకు ఈ సినిమా షూటింగ్ కోసం రజినీ కాంత్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తుంది.
హైదరాబాద్ లోని రామోజీ ఫిలిం సిటీ లో ఈ సినిమా తాజా షెడ్యూల్ ప్రారంభం కాబోతుంది.ఇది రజినీ కాంత్ కు 168 వ సినిమా గా తెరకెక్కుతుంది.
ఇందులో కుష్బూ, మీనా హీరోయిన్లుగా నటిస్తున్నారు.అంతేకాదు టాలీవుడ్ టాప్ హీరోయిన్ కీర్తి సురేష్ కూడా ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తుంది.
అయితే ఇప్పుడు జరిగే షెడ్యూల్ లో కీర్తి సురేష్, రజినీ కాంత్ మధ్య కొన్ని సీన్స్ తీయబోతున్నారని సమాచారం.
రజినీ కాంత్, కీర్తి సురేష్ మధ్య తీయబోయే సీన్స్ ఇంటర్వెల్ సీక్వెన్స్ లో వస్తాయట.ఈ షెడ్యూల్ అయి పోయిన తర్వాత రజినీ కాంత్, కుష్బూ మధ్య ఫ్యామిలీ సీన్స్ చిత్రీకరిస్తారని సమాచారం.ఇప్పటికే కుష్బూ ఒక ఇంటర్వ్యూ లో ఈ సినిమా గురించి తెలిపింది.
ఈ సినిమాలో రజినీ కాంత్ తన మధ్య వచ్చే సన్నీ వేశాలు చాలా బాగుంటాయని.బాగా అలరిస్తాయని తెలిపింది.ఈ సినిమాలో తన పాత్ర కూడా చాలా కొత్తగా ఉంటుందని చెప్పుకొచ్చింది.
అంతేకాదు ఈ సినిమా కోసం కుష్బూ చాలా బరువు తగ్గి సన్నగా మారడమే కాకుండా సరికొత్తగా రెడీ అయ్యింది.
రజిని కాంత్, కుష్బూ కలిసి చాలా సినిమాల్లో నటించారు.వీరిది హిట్ పెయిర్.చాలా సంవత్సరాల తరువాత మల్లి వీళ్లిద్దరు కలిసి నటిస్తున్నారు.అయితే ప్రస్తుతం కీర్తి మహేష్ బాబు సరసన సర్కారు వారి పాటలో హీరోయిన్ గా నటిస్తుంది.
ఈ సినిమా షూటింగ్ కూడా శరవేగంగా జరుగుతుంది.