అమర్ దీప్ ఏదో చేద్దామని బిగ్ బాస్ కి వెళ్లారు... ఏం పీకాడు: నటరాజ్ మాస్టర్

బిగ్ బాస్ సీజన్ సెవెన్(Bigg Boss 7) తెలుగు కార్యక్రమం రేపటితో మూడు వారాలను పూర్తి చేసుకుంటుంది.ఇలా ఈ కార్యక్రమం మూడు వారాలను పూర్తి చేసుకున్నటువంటి తరుణంలో హౌస్ లో ఉన్నటువంటి కంటెస్టెంట్ల ఆట తీరు ఎలా ఉంది ఏంటి ఎవరు ఎలా పర్ఫామ్ చేస్తున్నారన్న విషయాలపై పలువురు వివిధ రకాలుగా కామెంట్ చేస్తున్నారు.

 Nataraj Master Sennsational Comments About Bigg Boss Contestant Amardeep Details-TeluguStop.com

ఇక ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి బుల్లితెర నటులలో ఒకరైన అమర్ దీప్(Amardeep) సీరియల్స్ పరంగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.అలాగే విపరీతమైనటువంటి ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా సొంతం చేసుకున్నారు.

Telugu Amardeep, Amardeepbigg, Bigg Boss, Nagarjuna, Nataraj Master, Natrajmaste

ఇలా సీరియల్స్ లో తన నటనతో మెప్పించినటువంటి అమర్ బిగ్ బాస్ లో మాత్రం తన ఆట తీరుతో ప్రేక్షకులను మెప్పించలేకపోతున్నారు.దీంతో ఆయన చాలా వెనకబడి ఉన్నారని గత వారం నాగార్జున (Nagarjuna) అమర్ కు వార్నింగ్ ఇచ్చారు ఇలా నాగార్జున వార్నింగ్ ఇచ్చినప్పటికీ ఈయన మాత్రం తన ఆట తీరును మార్చుకోలేదు అయితే తాజాగా అమర్ దీప్ ఆట తీరుపై నటరాజ్ మాస్టర్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం సంచలనంగా మారాయి.

Telugu Amardeep, Amardeepbigg, Bigg Boss, Nagarjuna, Nataraj Master, Natrajmaste

ఈ సందర్భంగా నటరాజ్ మాస్టర్ (Nataraj Master) మాట్లాడుతూ అమర్ దీప్ ఏదో చేస్తానని బిగ్ బాస్ కార్యక్రమానికి వెళ్లారు అయితే అక్కడ ఆయన చేసింది ఏమీ లేదు.మొదటివారం ఏం చేయలేదు రెండోవారం బీటెక్ వ్యవహారంతో ఫేమస్ కావాలని ప్రయత్నం చేశారు.అయితే అది ఆయనకే రివర్స్ అయ్యింది.మాట మాట్లాడితే మేము సీరియల్ వాళ్ళ అది చేస్తాం ఇది చేస్తామంటారు ముందు నువ్వు గేమ్ ఆడు గ్రూప్ కట్టి గేమ్ ఆడటం మంచిది కాదు అంటూ ఈయన తెలిపారు.

ఇక మీ అందరికంటే ప్రశాంత్( Pallavi Prashanth ) చాలా బెటర్ ఆయన చాలా బాగా గేమ్ ఆడుతున్నారని తెలిపారు.ఇక తనని టార్గెట్ చేయడం అంటే పిచ్చుక పై బ్రహ్మాస్త్రం ఉపయోగించడం లాంటిదేనని అమర్ దీప్ వ్యవహరి శైలి పై నటరాజు మాస్టర్ చేసినటువంటి ఈ కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube