నాచురల్ స్టార్ నాని( Natural star Nani ) బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వస్తూనే ఉన్నాడు.మినిమం గ్యారెంటీ హీరో అనిపించుకుంటూ నాని దూసుకు పోతున్నాడు.
ఈయన నుంచి వచ్చిన సినిమా టాక్ తో సంబంధం లేకుండా మినిమం వసూళ్లు రాబడుతూనే ఉన్నాయి.అందుకే తాజాగా ఆయన హీరోగా రూపొందిన హాయ్ నాన్న సినిమా( hi nanna movie ) కూడా మంచి విజయాన్ని సొంతం చేసుకోవడంతో పాటు భారీ గా వసూళ్లు సాధిస్తుందనే నమ్మకం వ్యక్తం అవుతోంది.
అందులో భాగంగానే హాయ్ నాన్న సినిమా కు సాలిడ్ ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిందనే వార్తలు వస్తున్నాయి.థియేట్రికల్ అండ్ నాన్ థియేట్రికల్ రైట్స్ ద్వారా నిర్మాతలు పెట్టిన దాని కంటే 10 శాతం అదనంగా వచ్చిందట.అంటే సినిమా విడుదల అయ్యి మీడియం రేంజ్ టాక్ దక్కించుకున్నా కూడా వచ్చే వసూళ్లతో సంబంధం లేకుండా నిర్మాతలకు లాభాలు దక్కబోతున్నాయి.నాని ప్రతి సినిమాకు కూడా ఇలాగే బడ్జెట్ ను మించి ప్రీ రిలీజ్ బిజినెస్ ( Pre-release business )జరుగుతోంది.
దాంతో లాభాలు నిర్మాతలకు విడుదలకు ముందే వస్తున్నాయి.
ఇలా చాలా అరుదుగా మాత్రమే ఇతర హీరోలకు దక్కుతుంది.కానీ నాని కి మాత్రం వరుసగా నాలుగు సినిమాలకు ఇదే విధంగా జరిగిందని బాక్సాఫీస్( box office ) వర్గాల వారు అంటున్నారు.నిర్మాతలు నాని తో సినిమా ను నిర్మిస్తే ఈజీగా తమ బడ్జెట్ ను రికవరీ చేసుకోవచ్చు అనే అభిప్రాయం ఏర్పడింది.
అందుకే ఆయన తో నిర్మించేందుకు చాలా మంది నిర్మాతలు ముందుకు వస్తున్నారు.అయితే నాని మాత్రం చాలా స్లో గానే సినిమా లు ఎంపిక చేస్తున్నాడు.ఏడాదికి కనీసం రెండు సినిమాలు చేసే విధంగా నాని గారు ప్లాన్ చేస్తున్నారు అంటూ ఆయన సన్నిహితులు చెబుతున్నారు.నాని హాయ్ నాన్న వచ్చే నెల మొదటి వారం లో విడుదల కాబోతున్న విషయం తెల్సిందే.