దసరా సినిమా తర్వాత నాని ( Nani )నటించిన చిత్రం హాయ్ నాన్న( Hai Naana ) .ఈ సినిమా డిసెంబర్ 7వ తేదీ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉంది దసరా సినిమా తర్వాత ఈ సినిమా విడుదల కానున్న నేపథ్యంలో ఈ సినిమాపై కూడా ఇప్పటికే అంచనాలు భారీగానే ఉన్నాయి.
ఇక ఈ సినిమా తండ్రీ కూతుర్లను మధ్య ఉన్నటువంటి అనుబంధాన్ని తెలియజేస్తూ ప్రేక్షకుల ముందుకు రాబోతుందని తెలుస్తోంది.ఇక ఈ సినిమాలో నానికి జోడిగా మృణాల్ ఠాకూర్ ( Mrunal Thakur ) నటిస్తున్నారు.
ఇక ఈ సినిమా విడుదల తేది దగ్గర పడుతున్న నేపథ్యంలో నాని పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.
ఇందులో భాగంగానే ఈయన తెలంగాణలో ఎన్నికల హడావిడి కొనసాగుతున్న నేపథ్యంలో రాజకీయ నాయకులను ఇమిటేట్ చేస్తూ పెద్ద ఎత్తున తన సినిమాని కూడా ప్రమోట్ చేస్తూ వస్తున్నారు.ఇప్పటికే హాయ్ నాన్న సినిమా అధికారంలోకి వస్తే చేసేది ఇవే అంటూ మేనిఫెస్టో కూడా విడుదల చేసిన సంగతి తెలిసిందే.తాజాగా ప్రెస్ మీట్ నిర్వహించినటువంటి ఈయన తన సినిమా గురించి మాట్లాడుతూ… బాక్స్ ఆఫీస్ వద్ద నార్త్ ఇండస్ట్రీ సౌత్ ఇండస్ట్రీ అని తేడాలు ఉండవని ఈయన తెలిపారు.
ఈ సినిమా ఎట్టి పరిస్థితులలోను డిసెంబర్ 7వ తేదీ విడుదలవుతుందని తెలిపారు.
ఇక సినిమా ఫలితం గురించి కూడా ఈయన మాట్లాడుతూ సినిమా బాగుంటే ఆడతది లేకుంటే పీకతది.డిసెంబర్ 7వ తేదీ థియేటర్లలో దావత్ చేసుకోవాలి తమ్ముడు నువ్వు ఏదో కిరికిరి చేయాలని చూస్తున్నావ్ అదేమీ కుదరదు అనుకున్న టైంకి సినిమా విడుదలవుతుంది అంటూ ఈ సందర్భంగా ఈయన తెలంగాణ యాసలో మాట్లాడుతూ చేసినటువంటి ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.అయితే నాని ఈ సినిమా సక్సెస్ అందుకుంటుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు.
ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైనటువంటి పోస్టర్లు కూడా సినిమాపై భారీగానే అంచనాలను పెంచేసాయి.మరి ఈ సినిమా ఎలాంటి సక్సెస్ అందుకుంటుందో తెలియాల్సి ఉంది.