చైల్డ్ ఆర్టిస్ట్ చుట్టూ కథ నడిపిస్తూ హిట్టు కొడుతున్న నందమూరి హీరోలు

ఇటీవల కళ్యాణ్ రామ్ అనేక ఫ్లాపుల తర్వాత ఒక సరైన హిట్ కొట్టాడు.గత శుక్రవారం విడుదలైన బింబిసారా సినిమా అంచనాలను మించి జనాల అభిమానాన్ని దక్కించుకొని సర్వత్రా మంచి రెస్పాన్స్ ని దక్కించుకుంది.

 Nandamuri Heros Success Formula Ntr Kalyan Ram Balakrishna Details, Nandamuri He-TeluguStop.com

బింబిసార ఇచ్చిన విజయంతో నందమూరి అభిమానుల్లో ఆనందం వెల్లివిరిసింది అనే చెప్పాలి.కొన్నేళ్లుగా సరైన హిట్ లేక కళ్యాణ్ రామ్ ఇబ్బందులు పడుతున్న విషయం మనందరికీ తెలిసిందే.

అలా ఆకలి మీదున్న కళ్యాణ్ రామ్ కి బింబిసారా ఒక సరైన సినిమా అనే చెప్పాలి.కథ బాగుంటే ఎలాంటి సినిమా అయినా హిట్ అవుతుందని బింబిసారా విజయం మరొకసారి రుజువు చేసింది.

ఇక నందమూరి హీరోస్ అందరూ కూడా హిట్స్ కొట్టడానికి ఒకే ఫార్ములా ని నమ్ముకున్నట్టుగా తెలుస్తోంది.ఎందుకంటే కొన్ని ప్లాపుల అనంతరం బాలకృష్ణకి అఖండ సినిమాతో గట్టి విజయం లభించింది.

ఈ సినిమా కథ మొత్తం కూడా ఒక పాప చుట్టూ తిరుగుతుంది.ఆర్ఆర్ఆర్ సినిమాతో జూనియర్ ఎన్టీఆర్ సైతం అమోఘమైన హిట్ ని తన ఖాతాలో వేసుకున్నాడు.

ఈ సినిమాలో మల్లి అనే పాప చుట్టే ఈ సినిమా కథ అంతా కూడా తిరుగుతుంది.దాంతో బాలకృష్ణ ఫార్ములానే ఎన్టీఆర్ సైతం రిపీట్ చేసినట్టుగా అనుకోవాలి.

Telugu Akhanda, Balakrishna, Bimbisara, Child, Ntr, Kalyan Ram, Malli, Nandamuri

ఇక ప్రస్తుతం కళ్యాణ్ రామ్ సైతం బింబిసారా సినిమాకి ఇలాంటి ఒక ఎమోషనల్ పాయింట్ ని నమ్ముకున్నాడు.ఈ సినిమాలో సైతం ఒక పాప చుట్టే సినిమా కథ మొత్తం తిరుగుతుంది.ఇది కూడా ప్రస్తుతం విజయాన్ని సాధించడంతో ఈ నందమూరి హీరోలంతా కూడా ఒకే రకమైన ఫార్ములాన్ని నమ్ముకుని సినిమాలు చేస్తున్నారని అభిమానులంతా బల్ల బుద్ధి మరి చెబుతున్నారు.ఏమైనా ఒక సినిమా హిట్టు కావాలంటే అది మామూలు విషయం కాదు.

అలా ఒకే రకమైన కంటెంట్ తో నందమూరి హీరోలు అంతా విజయం సాధించడం అంటే విశేషం అని చెప్పాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube