అలాంటి సినిమాలు చూడాలంటే నాకు భయం .. నాగ్ సంచలన వ్యాఖ్యలు వైరల్!

టాలీవుడ్ సీనియర్ హీరోలలో ఒకరైన నాగార్జునకు( Nagarjuna ) ప్రేక్షకుల్లో ఊహించని స్థాయిలో క్రేజ్ ఉండగా ఈ మధ్య కాలంలో అదృష్టం కలిసిరాకపోవడంతో నాగార్జున సినిమాలేవీ బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో సక్సెస్ సాధించడం లేదు.అయితే సరైన పాత్ర దొరికితే మాత్రం నాగ్ సక్సెస్ సాధించడం, మళ్లీ సక్సెస్ ట్రాక్ లోకి రావడం కష్టమైతే కాదని సోషల్ మీడియాలో కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

 Star Hero Nagarjuna Comments Goes Viral In Social Media Details Here , Nagarjuna-TeluguStop.com

ఇతర హీరోల సినిమాలను తన వంతుగా ప్రమోట్ చేసే విషయంలో సైతం నాగార్జున ముందువరసలో ఉంటారనే సంగతి తెలిసిందే.మహేష్ భట్ సమర్పణలో రూపొందిన 1920 హార్రర్స్ ఆఫ్ ది హార్ట్ సినిమాకు కృష్ణ భట్ దర్శకత్వం వహించగా జూన్ నెల 23వ తేదీన తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్లలో ఈ సినిమా విడుదల కానుంది.

నాగార్జున చేతుల మీదుగా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ కావడం గమనార్హం.

Telugu Nagarjuna, Horrors Heart, Mahesh Bhatt, Tollywood-Movie

నాగ్ మాట్లాడుతూ మహేష్ భట్ నా మనస్సులో ఎప్పుడూ ఉంటారని ఆయనను కలిసి 20 సంవత్సరాలు అయిందని చెప్పుకొచ్చారు.మహేష్ భట్ మనస్సులో నేను కూడా ఉంటానని భావిస్తున్నానని నాగ్ పేర్కొన్నారు.మహేష్ భట్( Mahesh Bhatt ) నా గురువు అని నాకు స్పూర్తినిచ్చే వ్యక్తి అని నాగార్జున కామెంట్లు చేయడం గమనార్హం.

మహేష్ భట్ పాటలు చేయించుకునే విధానం అద్భుతం అని నాగ్ తెలిపారు.

Telugu Nagarjuna, Horrors Heart, Mahesh Bhatt, Tollywood-Movie

సాధారణంగా నాకు హర్రర్ సినిమాలు చూడటం అంటే భయమని అయితే 1920 హార్రర్స్ ఆఫ్ ది హార్ట్ సినిమా( Horrors of the Heart ) మాత్రం చూస్తానని నాగ్ చెప్పుకొచ్చారు.ఆడియన్స్ ఈ సినిమాను సక్సెస్ చేయాలని కోరుతున్నానని నాగార్జున కామెంట్లు చేశారు.నాగార్జున వెల్లడించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరోవైపు నాగ్ కొత్త ప్రాజెక్ట్ లకు సంబంధించి సస్పెన్స్ కొనసాగుతోంది.నాగ్ తన కొత్త సినిమాలను ఎప్పుడు ప్రకటిస్తారో చూడాల్సి ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube