తెలుగు బుల్లి తెరను గత ఏడు సంవత్సరాలుగా ఏలేస్తున్న కామెడీ షో జబర్దస్త్.ఈ కామెడీ షోలో జడ్జ్‌గా నాగబాబు మొదటి నుండి చేస్తూ వచ్చాడు.
అయితే కొన్ని కారణాలు అంటూ ఆ షోను నాగబాబు వదిలేశాడు.ఈటీవీలో ప్రధానమైన ఈ షోను నాగబాబు వదిలేయడంతో ఆ షో పనైపోయినట్లే అంటూ అంతా అనుకున్నారు.
నాగబాబు జబర్దస్త్‌ను వదిలేసిన తర్వాత ఏం చేస్తాడు, ఏ షో చేయబోతున్నాడు అంటూ అంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారు.జీ తెలుగులో ఈయన ఎంట్రీ ఇవ్వబోతున్న విషయం ముందే తెల్సిందే.

మొదట నాగబాబు లోకల్ గ్యాంగ్స్ అనే షో తో రాబోతున్నట్లుగా ప్రచారం జరిగింది.కాని ఆ షో కేవలం ప్రమోషన్ వరకే అని తేలిపోయింది.ఇప్పుడు నాగబాబు అసలు జబర్దస్త్ షో ఏంటో తేలిపోయింది.జీ తెలుగులో అదిరింది అనే షో తో నాగబాబు రీ ఎంట్రీకి సిద్దం అయ్యాడు.జబర్దస్త్ అంటూ గత ఏడు సంవత్సరాలుగా ఎంటర్‌టైన్‌మెంట్ ను అందించిన నాగబాబు ఇకపై అదిరింది అంటూ కామెడీ పంచ్‌లకు నవ్వబోతున్నాడు.

జబర్దస్త్ నుండి పలువురు కామెడియన్స్‌ను తీసుకు వచ్చి ఈ కామెడీ షో చేయబోతున్నట్లుగా తెలుస్తోంది.అదిరింది కామెడీ షో ను ప్రతి ఆదివారం ప్రసారం చేయబోతున్నారు.ఆదివారాల్లో సినిమాలపై ఎక్కువ ఆసక్తి చూపిస్తారు.
కాని నాగబాబు మాత్రం ఆదివారం అయితేనే బాగుంటుందనే అభిప్రాయంతో అదిరింది షోను ఆదివారం ప్రసారం చేయించబోతున్నాడు.అతి త్వరలోనే ఈ షో ప్రసారం కాబోతుంది.
మరి జబర్దస్త్‌కు ఇది ప్రత్యర్థిగా నిలవగలుగుతుందా అనేది చూడాలి.