అక్కినేని హీరో నాగచైతన్య ప్రస్తుతం ‘సాహసం శ్వాసగా సాగిపో’ చిత్రంలో నటిస్తున్న విషయం తెల్సిందే.గౌతం మీనన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆ చిత్రాన్ని త్వరలోనే విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
ఆ చిత్రం విడుదలకు ముందే చైతూ మరో చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.మలయాళంలో సూపర్ హిట్ అయిన ‘ప్రేమమ్’ రీమేక్‌లో నటించేందుకు చైతూ ఓకే చెప్పాడు.
‘కార్తికేయ’ ఫేం చందు మొండేటి దర్శకత్వంలో ఈ రీమేక్ తెరకెక్కబోతుంది.ఈ చిత్రంలో కథానుసారంగా ముగ్గురు ముద్దుగుమ్మలు హీరోయిన్స్‌గా కనిపించబోతున్నారు.
‘ప్రేమమ్’ చిత్రంలో నటించిన అనుపమ పరమేశ్వరన్‌ను తెలుగు రీమేక్‌లో చైతూకు జోడీగా ఒక హీరోయిన్గా ఎంపిక అయ్యింది.శృతిహాసన్ మరో హీరోయిన్గా ఎంపిక అయినట్లుగా గత కొన్ని రోజులుగా ఫిల్మ్ సర్కిల్స్‌లో ప్రచారం జరుగుతూ వస్తోంది.
శృతి కూడా చైతూతో ఒక చిత్రాన్ని చేయనున్నట్లుగా సన్నిహితుల వద్ద చెప్పుకొస్తున్నట్లుగా తెలుస్తోంది.అది ప్రేమమ్ రీమేక్ అయ్యి ఉంటుందని అంచనా.
ఇక మూడవ హీరోయిన్ను తాజాగా ఎంపిక చేశారు.లక్కీ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్‌ను చైతూకు జోడీగా ఎంపిక చేసినట్లుగా తెలుస్తోంది.
ప్రస్తుతం ఎన్టీఆర్, చరణ్, బన్నీ వంటి స్టార్స్‌తో నటిస్తున్న రకుల్ ముగ్గురు హీరోయిన్స్‌లో ఒక్క హీరోయిన్గా నటించేందుకు ఒప్పుకుని పెద్ద సాహసం చేసిందని అంటున్నారు.అయితే రకుల్ మాత్రం పాత్ర ప్రాముఖ్యత దృష్ట్యా ఒప్పుకున్నట్లుగా సన్నిహితులతో చెబుతోంది.