నన్ను కావాలనే బ్యాడ్ చేశారు.. కన్నీళ్లు పెట్టిన ముమైత్ ఖాన్..?

బిగ్ బాస్ నాన్ స్టాప్ లో తాజాగా ఫస్ట్ వీక్ గడిచింది.ఇక బిగ్ బాస్ నాన్ స్టాప్ నుంచి మొదటి వారంలోనే ముమైత్ ఖాన్ బయటకు వచ్చేసింది.

 Mumaith Khan Burst Out After Elimination In Bigg Boss Non Stop Details, Mumait-TeluguStop.com

మొదటి వారం ఎలిమినేషన్ లో చివరిలో సరయు, ముమైత్ ఖాన్ లు మిగలగా, వారిలో కచ్చితంగా తానే ఎలిమినేట్ అవుతాను అంటూ సరయు వెక్కివెక్కి ఏడ్చేసింది.తెనాలి 7 ఆర్ట్స్ సరయు 7 డేస్ అంటూ మళ్ళీ ట్రోలింగ్స్ చేస్తారు అంటూతెగ ఏడ్చేసింది.

ఇక చివరికి ముమైత్ ఖాన్ ఎలిమినేట్ అయ్యి, సరయు సేఫ్ అయినప్పటికీ ఆమె వెక్కి వెక్కి ఏడ్చేసింది.

ఇక ఎలిమినేట్ అయిన తర్వాత ముమైత్ ఖాన్ నవ్వుతూ ఎవరు తనవద్దకు రావద్దు కొంతసేపు ఒంటరిగా వదిలేయండి అని అనేసింది.

స్మోకింగ్ జోన్ లో స్మోక్ చేస్తూ ముమైత్ ఖాన్ కొన్ని ఆరోపణలు చేసింది.తనను కావాలి అనే బ్యాడ్ చేశారని, అంతేకాకుండా కావాలనే బ్యాడ్ గా చూపించారని, అందరూ జాగ్రత్తగా ఉండండి అంటూ అరియానా, తేజస్వి, అషు లకు సలహా ఇచ్చింది ముమైత్ ఖాన్.

స్టేజ్ మీదకు వచ్చిన తర్వాత ముమైత్ ఖాన్ తెగ ఏడ్చేసింది.

అంతేకాకుండా మొదటి సీజన్ లో తన గురించి ఎవరికీ అంతగా తెలియదని, అప్పుడు పడిన మార్కును తొలగించుకునేందుకు ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ కి వచ్చానని తెలిపింది ముమైత్ ఖాన్.కానీ ఇంత త్వరగా బయటకు వెళ్లడం బాధగా ఉంది అని తెలిపింది ముమైత్ ఖాన్. ఇంట్లో తనకు అందరూ అగ్రెసివ్ అనే ట్యాగ్ ఇచ్చారు.

కావాలనే బ్యాడ్ చేశారు అంటూ శివ, చైతూ, బిందు మాధవిల గురించి ముమైత్ ఖాన్ చెప్పింది.సరయు, శివ, చైతూ, బిందు మాధవి, మిత్రా శర్మను వేస్ట్ అంటూ చెప్పేసింది.

బెస్ట్ కేటగిరీలో అజయ్, నటరాజ్ మాస్టర్, తేజస్వీ, అషూ, అఖిల్ పేర్లను చెప్పేసింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube