ఢిల్లీ సీఎంకి మల్టీప్లెక్స్ థియేటర్ అసోసియేషన్ రిక్వెస్ట్..!

ఓ పక్క జనవరి 7న ఆర్.ఆర్.

 Multiplex Theater Association Request To Delhi Cm Aravind Kejriwal, Multiplex Th-TeluguStop.com

ఆర్ పాన్ ఇండియా రిలీజ్ అని హంగామా చేస్తుంటే మరోపక్క ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఢిల్లీ ప్రభుత్వం థియేటర్లు మూసి వేసింది.కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు పెరగడంతో ఢిల్లీ యెల్లో కేటగిరిలోకి వెళ్లింది.

ఈ క్రమంలో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ థియేటర్లు, షాపింగ్ మాల్స్, రెస్టారెంట్లు, పబ్బులు తాత్కాలికంగా మూసేయమని ఆర్డర్స్ పాస్ చేశారు.అయితే ఆర్.ఆర్.ఆర్ సినిమాకు ఈ దెబ్బ బాగానే పడేలా ఉంది.

అయితే ఢిల్లీ లో మల్టీప్లెక్స్ అసోషియేషన్ అంతా కలిసి సీఎం అరవింద్ కేజ్రీవాల్ ను 50 పర్సెంట్ ఆక్యుపెన్సీతో అయినా థియేటర్లు నడిపించేలా చూడమని రిక్వెస్ట్ చేశారట.అయితే దీనిపై సీఎం కేజ్రీవాల్ ఎలాంటి ప్రకటన చేయలేదు.

ఆర్.ఆర్.ఆర్ రిలీజ్ ఎలాగు వారం రోజులు ఉంది కాబట్టి ఈలోగా ఏదైనా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.అయితే ఢిల్లీ థియేటర్లు మూసేస్తే మాత్రం హిందీ మార్కెట్ పై భారీ దెబ్బ పడుతుంది.

ఇప్పటికే మహారాష్ట్రలో కూడా 50 శాతం ఆక్యుపెన్సీతో థియేటర్లు నడుస్తున్నాయి.అయితే ఆర్.ఆర్.ఆర్ రిలీజ్ టైం లో పరిస్థితి ఎలా ఉంటుంది అన్నది మాత్రం అర్ధం కావట్లేదు.ఎన్ని అవాంతరాలు వచ్చినా ఈసారి జనవరి 7న ఆర్.ఆర్.ఆర్ రిలీజ్ చేసి తీరుతాం అని ఫిక్స్ అయ్యారు మేకర్స్.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube