ఎన్నికలలో టీడీపీ జనసేన కూటమికి ఎన్ని స్థానాలు వస్తాయో చెప్పిన ఎంపీ రఘురామ కృష్ణరాజు..!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో మూడు నెలలలో ఎన్నికలు( AP Elections ) రాబోతున్నాయి.ఈ ఎన్నికలలో గెలవడానికి ప్రధాన పార్టీలు రకరకాల వ్యూహాలతో సిద్ధంగా ఉన్నాయి.

 Mp Raghurama Krishnaraju Said How Many Seats Tdp Janasena Alliance Will Get In T-TeluguStop.com

ప్రస్తుతం అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ మరోపక్క మేనిఫెస్టో రూపకల్పన పనులలో నిమగ్నమయ్యారు.ఈ సంక్రాంతి పండుగ అనంతరం ఎన్నికల ప్రచారానికి సిద్ధమవుతున్నారు.

వచ్చే ఎన్నికలలో తెలుగుదేశం…జనసేన కూటమిగా పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలో ఇప్పటికే సీట్ల సర్దుబాటు గురించి అదేవిధంగా ఉమ్మడి ఎన్నికల మేనిఫెస్టో గురించి రెండు పార్టీల నేతలు చంద్రబాబు.

( Chandrababu Naidu ) పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) చర్చిస్తున్నారు.పరిస్థితి ఇలా ఉంటే ఎంపీ రఘురామకృష్ణరాజు వచ్చే ఎన్నికలలో టీడీపీ.

జనసేన కూటమికి ఎన్ని స్థానాలు వస్తాయో తెలియజేశారు.

సంక్రాంతి పండుగ నేపథ్యంలో దాదాపు నాలుగు సంవత్సరాల తర్వాత సొంత నియోజకవర్గంలో ఎంపీ రఘురామకృష్ణరాజు( MP Raghurama Krishnaraju ) పర్యటిస్తున్నారు.ఈ సందర్భంగా ఆదివారం మీడియా సమావేశం నిర్వహించి జరగబోయే ఎన్నికలలో.టీడీపీ.

జనసేన కూటమి 135 స్థానాలు కైవసం చేసుకుంటుందని స్పష్టం చేశారు.తాను వైసీపీ ప్రభుత్వం కోసం ఎన్నో చేశానని అన్నారు.

కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన వైఎస్ షర్మిల( YS Sharmila ) ప్రభావం.వైసీపీ పై ఉంటుందని వ్యాఖ్యానించారు.

వచ్చే ఎన్నికలలో ఆమె చాలా ఓట్లు ప్రభావితం చేయగలరని స్పష్టం చేశారు.వీటిలో ఉంటే జరగబోయే ఎన్నికలలో టీడీపీ.

జనసేన కూటమి ఉమ్మడి అభ్యర్థిగా నరసాపురం ఎంపీగా రఘురామకృష్ణరాజు పోటీ చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube