MP Margani Bharat : పవన్ కళ్యాణ్ పై సీరియస్ వ్యాఖ్యలు చేసిన ఎంపీ భరత్..!!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై( Pawan Kalyan ) వైసీపీ ఎంపీ మార్గాన్ని భరత్( MP Margani Bharat ) కీలక వ్యాఖ్యలు చేశారు.కొద్ది రోజుల క్రితం మంగళగిరిలో పిఠాపురం నేతలతో పవన్ కళ్యాణ్ సమావేశమయ్యారు.

 Mp Margani Bharat : పవన్ కళ్యాణ్ పై సీరియస-TeluguStop.com

ఆ సమయంలో పిఠాపురం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వంగా గీత,( Vanga Geetha ) కాకినాడ ఎంపీ అభ్యర్థి సునీల్ ను( Sunil ) జనసేనలోకి ఆహ్వానించారు.దీనిపై మార్గాని భరత్ సెటైర్లు వేశారు.

వైసీపీ అభ్యర్థులను జనసేనలోకి ఆహ్వానించడం హాస్యాస్పదంగా ఉందని విమర్శించారు.వైసీపీ అభ్యర్థుల చేతుల్లో ఓడిపోతామని భయంతో పవన్ అలా మాట్లాడి ఉంటారని సెటైర్ వేశారు.

తన వెనకాల కాపు సామాజిక వర్గం ఉందని పవన్ కళ్యాణ్ భావిస్తున్నారు.

కానీ కాకినాడ పార్లమెంటులో( Kakinada Parliament ) 6 ఎమ్మెల్యే స్థానాలు ఒక ఎంపీ స్థానం కాపు సామాజిక వర్గానికి వైసీపీ ఇచ్చిందని స్పష్టం చేశారు.తెలుగుదేశం-జనసేన-బీజేపీ కూటమి కాపులకు ఎన్ని సీట్లు కేటాయించారు అంటూ ప్రశ్నించారు.కాపులకు పవన్ ఏం చేశారు అని నిలదీశారు.

రాజకీయాలలో పవన్ కళ్యాణ్ అమాయకుడు.ఒకసారి తమ పార్టీ నేతలను జనసేనలోకి ఆహ్వానిస్తున్నారు.

మరోసారి లక్ష మెజారిటీతో గెలుస్తామని పవన్ కళ్యాణ్ అంటున్నారు.అసలు ఆయన మైండ్ సెట్ ఏంటో అర్థం కావడం లేదని తన మైండ్ సెట్ ఏంటనేది ఆలోచించుకోవాలని ఎంపీ మార్గాని సూచించారు.

ప్రజలకు సేవ చేయడానికి రాష్ట్రాన్ని మార్చేందుకు రాజకీయాల్లోకి వచ్చేది.కానీ పవన్ చంద్రబాబు చేతిలో కీలుబొమ్మలాగా మారారని సెటైర్లు వేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube