Paranormal Activity : ప్రపంచంలోనే ఎక్కువ లాభాలు సాధించిన సినిమా ఇదే.. రూ.6 లక్షల బడ్జెట్ కు ఎంత వచ్చాయంటే?

మామూలుగా సినిమా ఇండస్ట్రీలో కొన్ని కొన్ని సినిమాలు తక్కువ బడ్జెట్ తో నిర్మించినప్పటికీ బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో పాటు కోట్లల్లో కలెక్షన్స్ సాధిస్తూ ఉంటాయి.మరి కొన్ని సినిమాలు కోట్లు పెట్టి నిర్మించినప్పటికీ సరైన సక్సెస్ ను సాధించకపోగా నిర్మాతలకు బోలెడు నష్టాలను మిగులుస్తూ ఉంటాయి ల్.

 Movie Worlds Most Profitable Film Made Just Rs 6 Lakh And Earn Rs 800 Crore-TeluguStop.com

అలాగ ఒక్కోసారి భారీ బడ్జెట్‌ సినిమాలు కనీస వసూళ్లు కూడా రాబట్టలేక చతికిలపడుతుంటే చిన్న చిత్రాలు మాత్రం ఊహించని స్థాయిలో కలెక్షన్స్‌ వసూలు చేస్తుంటాయి.మొదటి సందర్భంలో నిర్మాత పీకల్లోతు నష్టాల్లో కూరుకుపోతే రెండో సందర్భంలో మాత్రం నిర్మాత పంట పండినట్లే.

Telugu Crore, Hollywood, Micah Sloat, Oren Peli-Movie

ఇలా ఇప్పటికే ఎన్నో సందర్భాలలో జరిగాయి.అయితే మరి ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా కలెక్షన్స్ సాధించిన సినిమా ఏదో ఇప్పుడు మనం తెలుసుకుందాం.పారానార్మల్‌ యాక్టివిటీ అనే ఈ హాలీవుడ్‌ సినిమా విడుదల అయ్యి ఏకంగా 13,30,000.ఈ సినిమాను 2007లో హాలీవుడ్‌ డైరెక్టర్‌ ఓరెన్‌ పెలి( Oren Peli ) తెరకెక్కించాడు.

తనే కథ రాసుకుని, దర్శకత్వం వహించి స్వయంగా నిర్మించాడు.ఈ సినిమాలో నలుగురు మనుషులు, ఒక అస్థిపంజరం ఇవి మాత్రమే కనిపిస్తాయి.ఈ సినిమా తీయడానికి ఆయనకు 15 వేల డాలర్లు లో భారతీయ కరెన్సీ ప్రకారం రూ.6 లక్షలు ఖర్చయ్యాయి.అయితే పారామౌంట్‌ పిక్చర్స్‌ బ్యానర్‌ ఈ సినిమాను సొంతం చేసుకుని క్లైమాక్స్‌లో కాస్త మార్పులు చేర్పులు చేసి దానికి మరిన్ని హంగులు అద్ది రిలీజ్‌ చేసింది.దీనికి దాదాపు రూ.90 లక్షలు ఖర్చయ్యాయి.

Telugu Crore, Hollywood, Micah Sloat, Oren Peli-Movie

ఈ సినిమా ఎవరూ ఊహించనంతగా హిట్టయింది.ప్రపంచ వ్యాప్తంగా ఏకంగా 193 మిలియన్‌ డాలర్లు 2007లో భారతీయ కరెన్సీ ప్రకారం రూ.800 కోట్లు రాబట్టింది.ప్రపంచంలోనే తక్కువ బడ్జెట్‌లో ఎక్కువ వసూళ్లు రాబట్టిన చిత్రంగా సరికొత్త రికార్డును సృష్టించింది.అప్పటివరకు లాభాల పంట పండించిన చిత్రంగా ద బ్లైయిర్‌ విచ్‌ ప్రాజెక్ట్‌ పేరుతో ఉన్న రికార్డును పారానార్మల్‌ యాక్టివిటీ( Paranormal Activity ) మూవీ తన స్వాధీనం చేసుకుంది.

ఈ ఊపుతో పారానార్మల్‌ యాక్టివిటీ సినిమాకు సీక్వెల్స్‌ కూడా తీశారు.వరుసగా ఆరు సీక్వెల్స్‌ తీయగా ఇవి మొత్తంగా రూ.7320 కోట్లు రాబట్టాయి.ఇలా తక్కువ బడ్జెట్‌తో ఎక్కువ లాభాలు తీసుకొచ్చిన సినిమాల్లో ద బ్లెయిర్‌ విచ్‌ ప్రాజెక్ట్‌( The Blair Witch Projec ) రెండో స్థానంలో ఉంటుంది.1999లో వచ్చిన ద బ్లెయిర్‌ విచ్‌ ప్రాజెక్ట్‌.రూ.85 లక్షలతో తెరకెక్కగా రూ.1045 కోట్లు రాబట్టింది.అలాగే 2003లో వచ్చిన టార్నేషన్‌ కేవలం రూ.10,000తో తెరకెక్కగా రూ.5.5 కోట్లు సాధించింది.రెండు లక్షలతో తెరకెక్కిన పోర్నోగ్రఫీ చిత్రం డీప్‌ త్రోట్‌ రూ.17 కోట్ల కలెక్షన్స్‌ రాబట్టింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube