స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తమ బ్యాంకు వినియోగదారులకు ఎప్పుడు ఏదో ఒక ఆఫర్ ను ఇస్తూ ఉంటుంది.ఎస్బీఐ క్రెడిట్ కార్డు వాడే వారికి భారీ డిస్కౌంట్ లతో కూడిన ఆఫర్లు ను ఎస్బీఐ ఇస్తుంది.
ప్రముఖ ఈ కామర్స్ సంస్థ అయిన అమెజాన్ లో ఏ వస్తువు కొన్నా 10% తక్షణ తగ్గింపు ఉంటుంది అని ఈ సంస్థ తెలిపింది.
గరిష్టంగా రూ 10,750 వరకు తగ్గింపు ఉంటుంది అని కూడా తెలిపింది.
ఎస్బీఐ క్రెడిట్ కార్డు ద్వారా అమెజాన్ లో ఏవైనా వస్తువులు కొనాలంటే రూ 2500 బిల్లు కచ్చితంగా కావాలి.అప్పుడే ఈ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇచ్చిన ఆఫర్ వర్తిస్తుంది.
మొబైల్ ఫోన్ లపై అయితే కనీస బిల్లు రూ 5000 గా ఉండాలి.మనం ఏదైనా వస్తువును ఈఎంఐపై కొనుగోలు చేస్తే గరిష్టంగా రూ 1750 వరకు తగ్గింపు ఉంటుంది.
అదేవిధంగా ఈఎంఐ లేకుండా చేసే కొనుగోళ్లపై రూ 1500 వరకు తగ్గుతుంది.అలాగే ఇతర కేటగిరిల పై కూడా పైన పేర్కొన్న ఈఎంఐ ఆఫర్లే వర్తిస్తాయి.30 వేల వస్తువులు అమెజాన్లో కొనుగోలు చేస్తే రూ 1500 వరకు తగ్గింపు ఉంటుంది.50,000 లా వస్తువులు కొనుగోలు చేస్తే 3000 డిస్కౌంట్ ఉంటుంది.లక్ష రూపాయల వస్తువులు కొనుగోలు చేస్తే రూ 5000 వరకు తగ్గుతుంది.అన్ని కేటగిరీలకు కలిపి మొత్తం తగ్గింపు రూ 10,750 అవుతుంది.అంతేకాకుండా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్రెడిట్ కార్డ్ పై బోనస్ ఆఫర్లు కూడా ఉంటాయి.పైన పేర్కొన్న ఈ ఆఫర్లన్నీ కేవలం సెప్టెంబర్ 21 వ తేదీ వరకు మాత్రమే.