ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ( PM Narendra Modi ) విదేశీయ పర్యటన తలపెట్టిన సంగతి అందరికీ తెలిసినదే.ఈ క్రమంలో మోడీ అమెరికా పర్యటన( America ) చాలా విజయవంతంగా కొనసాగుతోంది.
న్యూయార్క్‌లోని ఐక్యరాజ్య సమితి లాన్‌లో అంతర్జాతీయ యోగా దినోత్సవంలో పార్టిసిపేట్ చేసిన ఆయన అక్కడి నుంచి నేరుగా వాషింగ్టన్‌కు చేరుకోవడం జరిగింది.తరువాత అమెరికా అధ్యక్షుడి అధికారిక నివాసం వైట్ హౌస్‌లో( White House ) ఆయనకు ఘనస్వాగతం లభించింది.
మోడీ జో బైడెన్, ప్రథమ మహిళ జిల్ బైడెన్ ఏర్పాటు చేసిన విందుకు హాజరయ్యారు.కాగా ప్రస్తుతం మోదీ చేపట్టిన అమెరికా పర్యటన సత్ఫలితాలను అందిస్తోందని విశ్వసనీయ వర్గాల సమాచారం.

ఎందుకంటే మోడీ అమెరికాలో ఉండగానే.భారత్‌పై అదిరిపోయే వరాలను కురిపించింది అగ్రరాజ్యం.అవును, భారత్‌లో త్వరలో కొత్తగా కాన్సులేట్లను( US Consulates ) ఏర్పాటు చేయబోతోన్నట్లు ప్రకటించింది.తొలిదశలో రెండు నగరాలను దానికోసం ఎంపిక చేసినట్టు సమాచారం.ఇందులో ఒకటి బెంగళూరు కాగా రెండో కాన్సులేట్‌ను ఎక్కడ ఏర్పాటు చేస్తారనేది ఇంకా తెలియాల్సి వుంది.ప్రస్తుతం దేశంలో 4 నగరాల్లో మాత్రమే యూఎస్ కాన్సులేట్స్.
తన కార్యకలాపాలను కొనసాగిస్తోంది.కోల్‌కత, ముంబై, హైదరాబాద్, చెన్నైల్లో యూఎస్ కాన్సులేట్స్ కార్యాలయాలు అందుబాటులో ఉంటోన్న సంగతి అందరికీ తెలిసినదే.
దీనికి అదనంగా మరో రెండింటిని నెలకొల్పుతామని వైట్ హౌస్.తాజాగా ప్రకటించింది.

ఇకపోతే, బెంగళూరులో ( Bangalore ) యూఎస్ కాన్సులేట్‌ను ఏర్పాటు చేయాలనే డిమాండ్ కొంత కాలంగా వినిపిస్తూ వస్తోన్న సంగతి అందరికీ తెలిసిందే.ఇక్కడి నుంచి పెద్ద ఎత్తున ఐటీ నిపుణులు అమెరికాకు రాకపోకలు సాగిస్తోన్న నేపథ్యంలో కాన్సులేట్‌ను ఏర్పాటు చేయాలంటూ గతంలో ప్రతిపాదనలు కూడా వినిపించాయి.అప్పట్లో అవి కార్యరూపాన్ని దాల్చలేకపోయాయి.కానీ తాజాగా దీన్ని అమెరికన్ ప్రభుత్వం ఆమోదించడంతో ఇది జరగబోతోందని సుస్పష్టమౌతోంది.ఇక్కడేగాని ఓ కార్యాలయాన్ని పెడితే కర్ణాటకతో పాటు కేరళీయులకు ఇది అనుకూలంగా ఉంటుంది అనడంలో అతిశయోక్తి లేదు.యూఎస్ కాన్సులేట్ అవసరాల కోసం ప్రస్తుతం రాయలసీమ వాసులు చెన్నై లేదా హైదరాబాద్‌కు వెళ్తున్నారు.
బెంగళూరులో ఏర్పాటు కావడం అటు ఈ ప్రాంతానికి కూడా అనుకూలంగా ఉంటుందని అనడంలో సందేహమే లేదు.