అట్లాంటిక్ మహా సముద్రంలో గల్లంతైన మినీ జలాంతర్గామి టైటాన్ కథ విషాదాంతంగా ముగిసింది.టైటానిక్ నౌక శకలాలను చూసేందుకు వెళ్లిన ఐదుగురు పర్యాటకులు మృతి చెందారని తెలుస్తోంది.
ఈ మేరకు ఓషన్ గేట్ సంస్థ ప్రకటన విడుదల చేసింది.ఈ ఘటనకు చింతిస్తున్నామన్న ఓషన్ గేట్ సంస్థ అట్లాంటిక్ మహా సముద్రంలో 12 వేల అడుగుల లోతులో మునిగిన టైటాన్ శకలాలను చూసేందుకు మినీ జలాంతర్గామి టైటాన్ బయలు దేరిన సంగతి తెలిసిందే.
మూడు రోజుల క్రితం టైటాన్ తో పాటు పర్యాటకుల ఆచూకీ గల్లంతైంది.వెంటనే రంగంలోకి దిగిన కెనడా, అమెరికా తీర రక్షక దళాలు విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు.
అయినా మినీ జలాంతర్గామి ఆచూకీ లభ్యం కాలేదు.







