నెల్లూరు డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ కు ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ కౌంటర్ ఇచ్చారు.ఈ క్రమంలో రూప్ కుమార్ కు పరోక్షంగా వార్నింగ్ ఇచ్చారని తెలుస్తోంది.
వైసీపీ నేత హాజీపై జరిగిన దాడితో తనకు ఎలాంటి సంబంధం లేదని ఎమ్మెల్యే అనిల్ కుమార్ తెలిపారు.హాజీతో తన పేరు చెప్పించి కావాలనే బురద జల్లుతున్నారని మండిపడ్డారు.
అన్నింటికీ తెగించి రాజకీయాల్లోకి వచ్చానన్న అనిల్ తన ఓపికను పరీక్షించొద్దని పేర్కొన్నారు.తాను తగ్గితే ఐదు నిమిషాలు చాలంటూ హెచ్చరించారు.
ఆధారాలు లేకుండా మాట్లాడితే ఊరుకునేది లేదని స్పష్టం చేశారు.