స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి ( Anushka Shetty ) స్ట్రాంగ్ కంబ్యాక్ కు సిద్ధం అవుతుంది.ఈ భామ నిశ్శబ్దం( Nishabdham ) తర్వాత మరో సినిమాను చేయలేదు.
అందుకే ఆమె ఫ్యాన్స్ కూడా ఈమె నటించిన సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని ఎదురు చూస్తున్నారు.లాంగ్ గ్యాప్ తర్వాత అనుష్క ఎట్టకేలకు మరో సినిమాను చేసింది.
ఆ సినిమా అతి త్వరలోనే రిలీజ్ కానుంది.
అనుష్క హీరోయిన్ గా నవీన్ పోలిశెట్టి హీరోగా తెరకెక్కిన లేటెస్ట్ మోస్ట్ ఎవైటెడ్ మూవీ ”మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి”..( Miss Shetty Mr Polishetty ).ఈ సినిమా మరోసారి ఆగస్టు లోనే రిలీజ్ అవ్వాల్సి ఉంది.కానీ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తికాక పోవడంతో ఈ సినిమాను వాయిదా వేస్తున్నట్టు మేకర్స్ తెలిపారు.
దీంతో ఫ్యాన్స్ నిరాశ చెందారు.
ఇక మళ్ళీ ఈ సినిమా సెప్టెంబర్ లో రిలీజ్ చేసేందుకు రిలీజ్ డేట్ ఫిక్స్ చేసారు.సెప్టెంబర్ 7న ఈ సినిమా వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ కానుంది.క్లీన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.
మరి రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో ప్రమోషన్స్ కు సిద్ధం అయ్యారు.ఈ క్రమంలోనే ఈ సినిమా యొక్క థియేట్రికల్ ట్రైలర్ ను ఈ రోజు విడుదల చేయనున్నారు.
ఈ మేరకు కొద్దిసేపటి క్రితం టైం అఫిషియల్ గా అనౌన్స్ చేసారు.ఈ ట్రైలర్ ను సాయంత్రం 6 గంటల 30 నిముషాలకు రిలీజ్ కానున్నట్టు తాజాగా మేకర్స్ తెలిపారు.
సరికొత్త పోస్టర్ తో ట్రైలర్ అప్డేట్ ఇచ్చారు.ఇక ఈ సినిమాను యువీ క్రియేషన్స్ బ్యానర్( UV Creations Banner ) వారు నిర్మిస్తుండగా రారా కృష్ణయ్య సినిమాతో డైరెక్టర్ గా మారిన మహేష్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు.