హైదరాబాద్ లోటస్ పాండ్ దగ్గర వైఎస్ఆర్ టీపీ అధినేత్రి వైఎస్ షర్మిలను పోలీసులు అరెస్ట్ చేసి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కు తరలించిన విషయం తెలిసిందే.లోటస్ పాండ్ వద్ద ఇంటి నుంచి బయటకు రావొద్దంటూ షర్మిలను పోలీసులు అడ్డుకున్నారు.
అయితే తనను ఎందుకు ఆపుతున్నారంటూ షర్మిల బయటకు వచ్చేందుకు ప్రయత్నించారు.ఈ నేపథ్యంలో ఆమె అడ్డుకున్న పోలీసులను నెట్టివేశారు.
దీనిపై తమతో షర్మిల దురుసుగా ప్రవర్తించారని పోలీసులు ఆరోపిస్తున్నారు.మహిళా కానిస్టేబుల్ తో పాటు మరో పోలీసును ఆమె నెట్టేశారు.
ఈ క్రమంలోనే షర్మిలపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేయనున్నట్లు తెలుస్తోంది.