ప్రస్తుత కాలంలో కొందరు మైనర్ బాలికలు కొందరు కేటుగాళ్లు వలలో పడి మాయ మాటలు నమ్మి మోసపోతున్నారు.తాజాగా ఓ మైనర్ బాలుడు తనతో పాటు చదువుతున్న ఓ బాలికను ప్రేమ పేరుతో లొంగదీసుకొని చివరికి ఆమెను గర్భవతి చేసిన ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లాలో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళితే స్థానిక జిల్లాలోని అమృతలూరు అనే మండలానికి చెందినటువంటి ఓ గ్రామంలో మైనర్ బాలిక తన కుటుంబ సభ్యులతో నివాసం ఉంటుంది.అయితే ఈమె స్థానికంగా ఉన్నటువంటి ఓ పాఠశాలలో పదో తరగతి చదువుతోంది.
ఈ క్రమంలో బాలికతో పాటు చదువుతున్న మరో మైనర్ బాలుడు బాలిక కు మాయమాటలు చెప్పి ప్రేమలో పడేశాడు.ఈ క్రమంలో ఇద్దరూ కలిసి పలుమార్లు హద్దులు కూడా దాటేశాడు.
దీంతో తాజాగా బాలికకు కడుపులో నొప్పి రావడంతో తన తల్లికి ఈ విషయం గురించి చెప్పింది.
దీంతో బాలిక తల్లి ఆమెను వెంటబెట్టుకొని దగ్గరలో ఉన్నటువంటి ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తీసుకెళ్ళింది.
ఈ క్రమంలో వైద్యులు వైద్య చికిత్సలు నిర్వహించిన అనంతరం బాలిక గర్భవతి అని తేల్చి చెప్పారు.దీంతో బాలిక తల్లి ఒక్కసారిగా ఖంగు తింది.
అలాగే బాలిక గర్భం దాల్చడానికి గల కారణాలు ఆరా తీసి మైనర్ బాలునిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది.