జగ్గయ్యపేట పట్టణం లోని ఎసీఎస్ కళాశాల వేది కగా ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను ఆధ్వర్యంలో గత మూడు రోజులుగా జరిగిన ఎస్పీఎం ప్రసాద్ మెమోరి యల్ రాష్ట్ర స్థాయి మహిళా కబడ్డీ పోటీలు ముగిశాయి.పోటీల్లో 13 ఉమ్మడి జిల్లాల నుంచి జట్లు పాల్గొనగా, కృష్ణా జట్టు ప్రథమ, విశాఖ ద్వితీ విజయనగరం తృతీయ, తూర్పుగోదావరి జట్టు నాలుగో స్థానంలో నిలిచాయి.
విజేత జట్లు వరసగా రూ.లక్ష, రూ.75 వేలు, రూ.50 వేలు, రూ.25 వేలు పారితోషకాన్ని పొందాయి.కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రాష్ట్ర పర్యాటక, క్రీడల శాఖ మంత్రి ఆర్కే రోజా పాల్గొని మాట్లాడుతూ అవకాశం ఇస్తే ప్రతి ఆడపిల్లా ఆడపులిలా మారుతుందని ఈ క్రీడలను చూస్తే అర్థమవుతుందన్నారు.
సంక్షేమం, అభివృద్ధితోపాటు అన్ని రంగాలకు సముచిత స్థానం కల్పిస్తున్న జగ నక్కు ప్రతి ఒక్కరూ అండగా ఉండాలన్నారు.తన సోదరుడి పేరుతో 30 సంవత్సరాలుగా క్రీడో త్సవం నిర్వహిస్తున్న ఉదయభానుఆమె అభినందించారు.
ఆసక్తికరంగా సాగిన తుది మ్యాచ్లో మంత్రి రోజా, జడ్పీ చైర్ప ర్సన్ ఉప్పాల హారిక, ఉదయభాను సతీమణి విమలాదేవిలు చెరో జట్టు తరఫున తలపడి క్రీడాకారులను ఉత్సాహపరిచారు.కార్యక్రమంలో జెడ్పీ చైర్ పర్సన్ తోక అరుణ్కుమార్, కేడీసీసీ బ్యాంకు చైర్మన్ తన్నీరు నాగేశ్వర రావు, మున్సిపల్ చైర్మన్ రంగాపురం రాఘవేంద్ర, పారామంట్ సురేష్, సామినేని వెంకటకృష్ణప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.