రాజమౌళి దర్శకత్వం లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన సినిమా బాహుబలి ఈ సినిమా ఎంత పెద్ద సక్సెస్ అయ్యిందంటే ఇండియా మొత్తం కలక్షన్ల సునామీ సృష్టించందనే చెప్పాలి ఎందుకంటే రాజమౌళి కొన్ని సంవత్సరాల కల కి ప్రతిరూపం బాహుబలి అందుకే ఎవ్వరికీ సాధ్యం కాని రీతిలో ఈ సినిమా తీసి భారతీయ జనాలందరూ గర్వపడేలా చేసాడు…మనకు రాజమౌళి సినిమా అంటే ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా అన్ని రాజమౌళి అండర్ లోనే జరుగుతాయి అనే విషయం అయితే తెలుసు కదా…
అదే విధంగా బాహుబలి సినిమా విషయం లోను అంత ఆయన చెప్పినట్టే జరిగింది కానీ ఒక్క విషయం లో మాత్రం ఆయన ప్రమేయం లేకుండానే జరిగింది అనే విషయం ఇండస్ట్రీ లో చాలా చర్చనీయాంశం అయింది అదేంటంటే బాహుబలి మొదటి పార్ట్ లో పచ్చ బొట్టేసిన సాంగ్ ని డైరెక్ట్ చేసింది రాజమౌళి కాదంట వాళ్ల గురువు అయిన రాఘవేంద్ర రావు అని చాలా మంది అంటూ ఉంటారు
అయితే ఇది ఎంత వరకు నిజం అనే విషయం ఎవరికీ తెలియదు.రాఘవేంద్ర రావు అలాంటి సాంగ్స్ తీయడం లో ఎక్స్ పర్ట్ అనే విషయం తెలిసిందే అందుకే ఈ సాంగ్ రాజమౌళి ఆయన్ని తీయమని చెప్పారు అని కొందరు అంటుంటే, మరికొందరు మాత్రం అలాంటిది ఏం లేదు ఆ సాంగ్ కూడా రాజమౌళి నే రాఘవేంద్ర రావు స్టైల్ లో తీశాడు అని చెప్తున్నారు.అయితే ఈ విషయం మీద అసలు క్లారిటీ ఎవరికి లేదనే చెప్పాలి కానీ మొత్తానికి మొదట్లో ఆ సాంగ్ వల్లే బాహుబలి సినిమా మీద భారీగా ఎక్స్ పెక్టేషన్స్ పెరిగాయని చెప్పాలి…