రహదారి రవాణా రంగం దేశ ప్రగతికి అత్యంత ముఖ్యమైనదని, రవాణా మౌలిక సదుపాయాలు దేశం యొక్క పురోగతికి వేగం మరియు సామర్థ్యాన్ని పెంచుతుందని తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు తెలిపారు.వస్తువులను రవాణా చేయడంలో మరియు పంపిణీ చేయడంలో నగరాల్లో నడుస్తున్న స్థానిక రవాణా కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు.
ఈ పోటీ ప్రపంచంలో, కొనుగోలు చేసిన లేదా విక్రయించిన లేదా తయారు చేసిన వస్తువులు సకాలంలో మరియు సురక్షితంగా సంబంధిత గమ్యాన్ని చేరుకోవడం అత్యవసరం అని అన్నారు.
హైదరాబాద్ గూడ్స్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ స్వర్ణోత్సవాలు రంగారెడ్డి జిల్లా, శంషాబాద్ పట్టణంలోని క్లాసిక్ కన్వెన్షన్ హాల్ లో శనివారం ఘనంగా జరిగాయి.
హైదరాబాద్ నలుమూలలనుండి ట్రాన్స్పోర్ట్ వ్యాపారాలు భారీఎత్తున హాజరైయ్యారు.ఈ స్వర్ణోత్సవాల సభకు హైదరాబాద్ గూడ్స్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ కార్యదర్శి వినీల్ పర్వతనేని స్వాగతం పలుకగా, అధ్యక్షులు అజయ్ కుమార్ బన్సల్ అధ్యక్షత వహించారు.
ఈ సభకు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు ముఖ్యఅతిథిగా, అశోక్ లేల్యాండ్, హెవీ, మీడియం కమర్షియల్ వెహికల్స్ హెడ్ సంజీవ్ కుమార్ గౌరవ అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్బంగా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ మాట్లాడుతూ రవాణా అనేది సమాజంలో విడదీయరాని భాగం అని, ప్రజల అవసరాలు మరియు వస్తువుల రవాణా అవసరాలను తీర్చడం ద్వారా చాలా పురాతన కాలం నుండి నాగరికతల అభివృద్ధికి రవాణా బాధ్యత వహిస్తుందన్నారు.
స్థిరమైన అభివృద్ధి అవకాశాలను అందిస్తూ, దేశ ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తుందని వెల్లడించారు.ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం ఎంతో పురోగతి సాధించిందని, ఇందుకు ఉదహరణ రాష్ట్రానికి వస్తున్న భారీ పెట్టుబడులు, పరిశ్రమలే అని చెప్పారు.
ఆర్థికవృద్ధిలో, తలసరి ఆదాయం పెరుగుదలలో, విద్య ఉపాధి రంగాల్లో అవకాశాల కల్పనా, విద్యుత్తు సరఫరాలో, తాగునీరు సాగునీటి సదుపాయంలో, ప్రజా సంక్షేమంలో, పారిశ్రామిక ఐటి రంగాల ప్రగతిలో ఇలా అనేక రంగాలలో తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచిందని తెలిపారు.రవాణా రంగ వ్యాపారులు తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో భాగస్వాములు కావాలని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు కోరారు.
సంజీవ్ కుమార్ మాట్లాడుతూ దేశీయ రవాణా అనేది దేశ ఆర్థిక వృద్ధికి కీలకమని, రవాణా సమస్యలు మరియు మౌలిక సదుపాయాల జాప్యాలు దేశం యొక్క పురోగతిని ప్రభావితం చేస్తాయని, భారతదేశానికి చాలా వేగవంతమైన మరియు సమర్థవంతమైన రవాణా వ్యవస్థలు అవసరం అని పేర్కొన్నారు.ప్రభుత్వాలు పర్యావరణ అనుకూలమైన, అధిక వేగం మరియు సమర్థవంతమైన రవాణా వ్యవస్థలు చేపడితే అప్పుడే దేశం యొక్క వేగవంతమైన వృద్ధికి దారి తీస్తుందని తెలిపారు.
లారీ యజమానులు, డ్రైవర్లు మరియు లోడ్‌మెన్ సరుకులను నిర్వహించడంలో మరియు రవాణా చేయడంలో విశేషమైన సేవ అందిస్తున్నారని వారికీ ప్రభుత్వాలు మౌలిక మరియు కనీస సౌకర్యాలు కల్పించాలని కోరారు.భద్రతా చర్యలపై డ్రైవర్లకు అవగాహన కల్పించాల్సిన గురుతర బాధ్యత లారీ యజమానులపై ఉండదని, డ్రైవర్లకు ఎప్పటికప్పుడు అవహగానా కల్పిస్తే ప్రమాదాలు తక్కువగా జరిగే అవకాశాలు ఉంటాయని సంజీవ్ కుమార్ చెప్పారు.
ఈ సభలో హైదరాబాద్ గూడ్స్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ నేతలు అంజనీ కుమార్ అగర్వాల్, నరేష్ గుప్తా, రామ్ కుమార్ రాఠీ, వినోద్ ఆర్య తదితరులు పాల్గొన్నారు.