నెల్లూరు: ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ప్రెస్ మీట్ కామెంట్స్.శాసన సభ సమావేశాలు ప్రారంభమయ్యాయి, ప్రజా సమస్యలు చర్చకు వస్తాయి అనుకున్నాం.
అసెంబ్లీ సమావేశాల్లో ఏదొక గొడవ చేసి సభ జరక్కుండా చూడాలని టీడీపీ చూసింది.టీడీపీ సీనియర్ నేతలు 2 వారాలు సమావేశాలు పెట్టాలని అడిగారు.5 రోజులు కాదు ఎన్నిరోజులు సమావేశం పెట్టినా ప్రజాధనం దుర్వినియోగం తప్ప మరేమీ లేదు.టీడీపీ ఎమ్మెల్యేలు సభా నిర్వహణలో సహకరించడం లేదు.
మూడు రాజధానులు విషయంలో చర్చ పెట్టాం.రాజధాని విషయంలో భూ బాగోతం బట్టబయలు అయింది.
ఆ వివరాలను మీ సభ్యుల ముందే బయటపెట్టాం.ప్రభుత్వ ఉత్తర్వులకంటే ముందే మీరు భూములు ఎందుకు కొన్నారు అంటే సమాధానం లేదు.
స్వార్ధ ప్రయోజనాల కోసం అమరావతిలో భూములు కొన్నారు.
అమరావతి రైతులు అంటూ టీడీపీ నేతలు చేస్తున్నది పాదయాత్ర కాదు చంద్రబాబు పాపాల యాత్ర.
రాష్ట్ర ప్రయోజనాలను పక్కన పెట్టి మీ ఆర్ధిక ప్రయోజనాల కోసం మూడు రాజధానులను అడ్డుకుంటున్నారు.పరిపాలన వికేంద్రీకరణ జరగకపోతే ప్రజలకి పథకాలు ఎలా అందించాలి.గ్రామస్థాయిలో పరిపాలన వికేంద్రీకరణ చేయకపోవడమే చంద్రబాబు చరిత్ర హీనుడిగా మిగిలిపోవడానికి కారణం.రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి గతంలో ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో సీఎం గారు సభలో వివరించారు.
గణాంకాలతో సహా పూర్తిగా వివరిస్తే అడ్డు పడతారు.అభివృద్ధి, సంక్షేమం అనే దిశగా మా ప్రభుత్వం అడుగులు వేస్తోంది.
ఆ పార్టీ ఈ పార్టీ అని లేకుండా అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి పథకాలు అందిస్తున్నాం.
సంగం, నెల్లూరు బ్యారేజీలకి నిధులు ఇవ్వకుండా నీరు చెట్టు కింద నిధులు తినేశారు.
శాశ్వత పధకాల గురించి టీడీపీ ప్రభుత్వం ఆలోచిందలేదు, సొంత ప్రయోజనాల కోసం పథకాలు తెచ్చారు.రాష్ట్రంలో జరుగుతున్న అభువృద్ధి వీళ్ళ కళ్ళకి కనపడడం లేదా.మీరు అడిగే ప్రశ్నలకు మేము సమాధానం చెప్పాలని అసెంబ్లీకి వస్తే తోకముడుచుకుని వెళ్లిపోతున్నారు.ఇంటికొక ఉద్యోగం ఇస్తానని చెప్పి ఒక్కరికన్నా ఉద్యోగం ఇచ్చారా.
నక్కజిత్తుల నారా డైరెక్టన్ లో ఎమ్మెల్యేలు ప్లకార్డులు పట్టుకుని అసెంబ్లీకి వచ్చారు.బాదుడే బాదుడు అని వస్తున్నారు… ఒంటరిగా దొరికితే చంద్రబాబుని జనాలు బాదుతారు.
మీరు సిగ్గు తెచ్చుకుని ప్రజల గురించి ఆలోచించి అసెంబ్లీలో మాట్లాడండి.