వినాయక చవితిని పురస్కరించుకొని ఆనవాయితీగా నగరంలోని వేయి స్థంబాల ఆలయంను సందర్శించి ప్రత్యేక పూజలో పాల్గొంటానని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు.వేయి స్థంబాల ఆలయ ఈవో, ప్రధాన అర్చకులు ఘనంగా స్వాగతం పలికారు.
వినాయక చవితి పురస్కరించుకొని పర్యావరనాన్ని కాపాడుకునే బాధ్యత ప్రతి ఒక్కరి పై ఉందన్నారు.ప్రకృతి రక్షణ కోసం వినాయక మండపాలా నిర్వహకులు మట్టి వినాయకుడిని పెట్టి పూజించాలన్నారు.
రసాయనాలతో తయారు చేసిన విగ్రహాలు చెరువుల్లో నిమజ్జనం చేస్తే పక్షులు, మూగ జీవాలు మృత్యువాత పడుతున్నాయాన్నారు.మనుషులకు అనేక రోగాలు వస్తాయని చెప్పారు.
ప్రకృతి పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ మట్టి వినాయకుడిని పూజించాలని చెప్పారు.ముఖ్యమంత్రి కెసిఆర్ నీతృత్వంలో రాష్ట్రo అభివృద్ధి పథంలో నడుస్తోందని తెలిపారు.
గణేషుడిని పూజించనిదే ఎలాంటి కార్యక్రమాలు చేపట్టరని తెలిపారు.గణేష్ ని పండుగ అంగరంగ వైభవంగా చేసుకోవడం ద్వారా వర్షాలు సమృద్ధిగా కురుస్తాయని, కరోనా లాంటి రోగాలు దరి చేరవని అన్నారు.
దేశ ప్రజలంతా ఆయురారోగ్యాలతో జీవించాలని ఆ భగవంతుడిని కోరుకున్నట్టు చెప్పారు.