మాస్ మహా రాజా రవి తేజ హీరో గా త్రినాధరావు నక్కిన దర్శకత్వం లో రూపొందుతున్న సినిమా ధమాకా.ఈ సినిమా విడుదలకు రెడీ అవుతోంది.
షూటింగ్ చివరి దశ లో ఉన్న ఈ సినిమా నుండి వరుసగా పోస్టర్లు విడుదల అవుతున్నాయి.ఈ సినిమా లో పెళ్లి సందడి హీరోయిన్ శ్రీ లీలా హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే.
ఆమె ఈ సినిమా కు ప్లస్ అవుతుందని యూనిట్ సభ్యులు భావిస్తున్నారు.కానీ కొందరు మీడియా సర్కిల్స్ వారు మరియు రవితేజ అభిమానులు మాత్రం ఆమె సినిమా కు మైనస్ అవుతుందేమో అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఐదు పదుల వయస్సు ఉండే రవితేజ రెండు పదుల వయసున్న శ్రీ లీలా తో చేస్తున్న రొమాన్స్ ఏ స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో అనే ఆందోళన వ్యక్తమవుతోంది.
ముఖ్యంగా రవితేజ అభిమానులు ఈ కాంబినేషన్ కి ఏ మాత్రం పాజిటివ్ గా రెస్పాన్స్ వస్తుంది అని ఆశించలేక పోతున్నామని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
సినిమా లో రవితేజ మరియు హీరోయిన్ తో రొమాన్స్ సన్నివేశాలు సినిమా కు మైనస్ అయ్యే అవకాశాలు కూడా లేక పోలేదు.అందుకే ఈ సినిమా విడుదల కాక ముందే అభిమానులు మరియు రవితేజ యాంటీ ఫ్యాన్స్ తీవ్రంగా ప్రచారం చేయడం మొదలు పెట్టారు.
రవితేజ గత సినిమా లు అయిన ఖిలాడి మరియు రామారావ్ ఆన్ డ్యూటీ ఫ్లాప్ అవడంతో కెరీర్ లో చాలా వెనుకబడి పోయాడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.రవితేజ ఇలాంటి ప్రయోగాలు చేస్తూ కెరియర్ ని మరింతగా ప్రమాదం లోకి నెట్టుకుంటున్నాడు అంటూ అభిమానులు కూడా కామెంట్స్ చేస్తున్నారు.
ఈ సినిమా తర్వాత రవితేజ నుండి రావణసురుడు మరియు టైగర్ నాగేశ్వరరావు సినిమాలు రాబోతున్నాయి.ఆ సినిమాల ఫలితం పరిస్థితి ఏంటో చూడాలి.