సర్పంచ్ ఎలక్షన్స్ లో నిలబడితే ఒకే ఒక్క ఓటు వచ్చిందట... అదికూడా...

ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు లేదా మరియు ఇతర విషయాలలో కూడా ఐకమత్యంగా ఉంటే గెలుపు ఇట్టే వరిస్తుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.ఇప్పటికే ఈ విషయాన్ని చాలా మంది నిరూపించారు కూడా.

 Men Got Only One Vote In Panchayat Election In Gujarat Details, Gujarat, Gujarat-TeluguStop.com

కానీ ఈ మధ్య కాలంలో మనిషిని మరో మనిషి నమ్మడం చాలా కష్టమైపోయింది.ఈ క్రమంలో ఇంట్లో వ్యక్తిని బయట వ్యక్తులు మాత్రమే కాకుండా ఇంట్లో వాళ్ళు కూడా నమ్మడం లేదు.

కాగా తాజాగా ఓ వ్యక్తి పంచాయతీ ఎన్నికలలో పోటీ చేయగా తనకు కేవలం తన ఓటు తప్ప ఇంకొక ఓటు పడని ఘటన గుజరాత్ రాష్ట్రంలో వెలుగు చూసింది.

పూర్తి వివరాల్లోకి వెళితే స్థానిక రాష్ట్రంలోని చార్వాలా పంచాయతీలో సంతోష్ అనే వ్యక్తి తన కుటుంబ సభ్యులతో కలిసి నివాసముంటున్నాడు.

అయితే సంతోష్ కి చిన్నప్పటి నుంచి కొంతమేర అభ్యుదయ భావాలు ఎక్కువగా ఉండటంతో ప్రజలకు సేవ చేయాలని రాజకీయాల్లోకి వచ్చాడు.కానీ అతడికి సేవ చేయాలని ఉన్నప్పటికీ డబ్బు, పదవి, హోదా వంటివి లేకపోవడంతో వెనకడుగు వేసే వాడు.

అయినప్పటికీ తన గ్రామంలో ఉన్నటువంటి సమస్యల గురించి రాజకీయ నాయకులతో మాట్లాడుతూ పరిష్కరించేవాడు.కాగా ఇటీవలే గుజరాత్ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు జరిగిన సంగతి అందరికీ తెలిసిందే.

దీంతో ఈ పంచాయతీ ఎన్నికలలో సంతోష్ చార్వాలా పంచాయతీ సర్పంచ్ పదవికి పోటీ చేశాడు.ఈ క్రమంలో తన కుటుంబం నుంచి మద్దతు లభించకపోయినప్పటికీ ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో ఎన్నికలలో స్వతంత్ర అభ్యర్థిగా నిలబడ్డాడు.

Telugu Gujarat, Votepanchayat, Santosh, Votes-Latest News - Telugu

ఈ క్రమంలో తన స్నేహితులు మరియు ఇతరులతో చర్చించి ప్రచారం కూడా చేశాడు.కానీ ఎలాంటి ఉపయోగం లేకపోయింది.తీరా చూస్తే ఎన్నికల రోజున సంతోష్ తనకు తానుగా వేసుకున్న ఒక్క ఓటు తప్ప వేరే ఎవరు సంతోష్ కి ఓటు వేయలేదు.కానీ ఇక్కడ ఆశ్చర్యపోవాల్సిన విషయం ఏమిటంటే సంతోష్ కుటుంబం లో దాదాపుగా 12 మంది ఓటు అర్హత కలిగిన వ్యక్తులు ఉన్నారు.

అయినప్పటికీ సంతోష్ కుటుంబ సభ్యులు కూడా అతడిని నమ్మి ఓటు వేయలేదు.దీంతో ఎన్నికల ఫలితాలు సమయంలో సంతోష్ కొంతమేర ఎమోషనల్ అయ్యాడు.

Telugu Gujarat, Votepanchayat, Santosh, Votes-Latest News - Telugu

దీంతో ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియా మాధ్యమాలలో తెగ వైరల్ అవుతోంది.అంతే కాకుండా ఈ విషయంపై కొందరు నెటిజన్లు స్పందిస్తూ సంతోష్ ని కనీసం తన కుటుంబ సభ్యులు కూడా నమ్మకపోవడం బాధాకరమైన విషయమని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.మరికొందరు మాత్రం ప్రజలకు సేవ చేయాలని సంతోష్ ముందుకు వచ్చి స్వతంత్ర అభ్యర్థిగా పోటీగా చేసినప్పుడే అతడు గెలిచాడని అలాగే ఎన్నికలలో గెలుపు, ఓటములు సహజమని కాబట్టి అవన్నీ పట్టించుకోకుండా ప్రజా సమస్యలపై పోరాటం చేస్తే ఖచ్చితంగా ప్రజలు గుర్తుంచుకుంటారని ఈ క్రమంలో అధైర్య పడకుండా ముందుకు సాగాలని సూచిస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube