స్వామి వివేకానంద వర్ధంతి సందర్భంగా నివాళులర్పించిన సేవ సమితి సభ్యులు

రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం మల్యాల గ్రామంలో స్వామి వివేకానంద 122వ వర్ధంతి కార్యక్రమాన్ని స్వామి వివేకానంద సేవాసమితి సభ్యుల ఆధ్వర్యంలో గ్రామంలోని స్వామి వివేకానంద విగ్రహానికి పూలమాలలు వేసి ఘనమైన నివాళులు అర్పించారు.ఈ కార్యక్రమంలో స్వామి వివేకానంద సేవా సమితి సభ్యులు గ్రామ యువకులు పాల్గొన్నారు.

 Members Of Seva Samiti Paying Tribute To Swami Vivekananda, Members Of Seva Sami-TeluguStop.com

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్వామి వివేకానంద జీవించింది 39 సంవత్సరాలైనా తన రచనల ద్వారా వెయ్యేల్ల పాటు చెరగని ముద్ర వేశారు.

మానవసేవయే మాధవ సేవ అని తెలిపారు.

రామకృష్ణ మిషన్ అనే సంస్థను 1899 లో ప్రారంభించి అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించారు.తాను కలలుగన్న నవీన భారతం రూపొందాలంటే ఇనుప కండరాలు, ఉక్కు నరాలు వజ్రతుల్యమైన మేధస్సు కలిగిన యువతీ యువకులు ఒక వంద మంది లభిస్తే చాలునని యువతకు పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో స్వామి వివేకానంద సేవ సమితి సభ్యులు, గ్రామస్తులు చిన్నారులు తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube