మామూలుగా ఒక డైరెక్టర్ వరుస ఫ్లాప్ లు అందిస్తున్నాడంటే ఏ హీరోలు కూడా ఆ డైరెక్టర్( Director ) తో సినిమా చేయడానికి ముందుకు రారు.ఎందుకంటే తెలిసి తెలిసి తమ గొయ్యి తాము తవ్వుకోరు కాబట్టి.
తెలిసి సినిమా చేస్తే ఆ సినిమా కచ్చితంగా ఫ్లాప్ అవుతుందనే భయంతోనే ఫ్లాపైన డైరెక్టర్లను తమ దరికి కూడా రానివ్వరు.డైరెక్టర్లు కూడా తమ సినిమాలతో హీరోలను నిరాశ పరుస్తున్నామని తెలుసుకొని మళ్లీ ఏ పెద్ద హీరోతో కూడా సినిమా తీయటానికి ముందుకు రారు.
కానీ ఇక్కడ డైరెక్టర్ మెహర్ రమేష్( Director Mehr Ramesh ) అలా కాదు.అసలు ఆయన రూటే వేరు.
ఇప్పటికే ఆయన చేసిన సినిమాలన్నీ ఆల్మోస్ట్ ఫ్లాప్స్ అని చెప్పాలి.అయినా కూడా ఒక విషయంలో ఈయనను మెచ్చుకుంటున్నారు జనాలు.
మరి దానికి ఒక రీజన్ కూడా ఉంది.అదేంటంటే.
తాజాగా చిరంజీవి నటించిన భోళా శంకర్( Bhola Shankar ) మెహర్ రమేష్ దర్శకత్వంలోనే వచ్చిన సంగతి తెలిసిందే.అయితే ఈ సినిమా మొదటి రోజే అందరినీ నిరాశపరిచింది.
ఎక్కడ కూడా సినిమా పట్ల ప్రేక్షకులు సాటిస్ఫాక్షన్ కాలేదు.దీంతో సినిమా ఫ్లాప్ అయినందుకు సినిమా కంటెంట్ గురించి కాకుండా డైరెక్టర్ మెహర్ గురించి మాట్లాడుకుంటున్నారు జనాలు.ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈయన ట్రోలింగ్ మెటీరియల్ గా మారిపోయాడని చెప్పాలి.మామూలుగా ఈయన చేసిన సినిమాలన్నీ ఫ్లాప్ అవుతున్న కూడా.వాటితో సంబంధం లేకుండా తర్వాత తీసే సినిమాలు ఏకంగా పెద్ద హీరోలతోనే సెటిల్ చేస్తున్నాడు.మొదటి నుంచి చూసినట్లయితే.
మొదట్లో ఆయన ఎన్టీఆర్ తో కంత్రి సినిమా రూపొందించాడు.కానీ ఈ సినిమా అంతగా సక్సెస్ కాలేదు.
ఇక ఆ తర్వాత ప్రభాస్ తో బిల్లా సినిమా రూపొందించాడు.ఇక ఈ సినిమా బాగున్నప్పటికీ కూడా రీమేక్ లీస్టులో పడిపోయింది.
మళ్లీ ఎన్టీఆర్ తో కలిసి శక్తి సినిమా చేశాడు.అప్పటికే ఎన్టీఆర్ ఆయనతో చేసిన కంత్రి సినిమా డిజాస్టర్ ను మోసాడు.
అయినా కూడా ఒక నమ్మకంతో ఆయనతో శక్తి సినిమా చేశాడు.కానీ ఈ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టింది.దీంతో మెహర్ రమేష్ కు బాగా ట్రోల్స్ కూడా వచ్చాయి.అప్పటికే సరైన సక్సెస్ లేకున్నా కూడా మళ్ళీ స్టార్ హీరో వెంకటేష్ తో షాడో సినిమా చేశాడు.
ఆ సినిమా కూడా పెద్ద షాక్ ఇచ్చింది.అప్పటికే శక్తి సినిమాతో డిజాస్టర్ టాక్ లో ఉన్న మెహర్ తో వెంకటేష్ కూడా సినిమా చేయడానికి ఎలా ఒప్పుకున్నాడని అందరూ ఆశ్చర్యపడ్డారు.
దీంతో మెహర్ 9 ఏళ్ళు సినిమాలకు బ్రేక్ ఇచ్చాడు.ఇక మళ్లీ రీఎంట్రీ తో చిరంజీవితో భోళా శంకర్ తెరకెక్కించాడు.
దీంతో జనాలు డైరెక్టర్ మెహర్ రమేష్ తీరు పట్ల ఆశ్చర్యపోతున్నారు.సినిమాలు డిజాస్టర్స్ అయిన కూడా ఆ ఇంపాక్ట్ తన మీద పడకుండా మరో సినిమా పట్టుకునే విషయంలో ఆయనను చూసి నేర్చుకోవాలి అని జనాలు ట్రోల్స్ చేస్తున్నారు.