బంధాలకు, అనుబంధాలకు ఎంతో ప్రాధాన్యత ఇచ్చే హీరోలలో మెగాస్టార్ చిరంజీవి ఒకరనే సంగతి తెలిసిందే.పెద్దలను గౌరవించే హీరోలలో చిరంజీవి ముందువరసలో ఉంటారు.
తండ్రి తమకు ఎంతో క్రమశిక్షణతో పెంచారని చాలా సందర్భాల్లో చిరంజీవి వెల్లడించారు.తండ్రి సాంవత్సరికం కావడంతో చిరంజీవి నాన్నను తలచుకుంటూ ఎమోషనల్ పోస్ట్ పెట్టగా ఆ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
చిరంజీవి తన పోస్ట్ లో “మాకు జన్మనిచ్చి క్రమశిక్షణతో పెంచి జీవితంలో ఒడిదుడుకుల పట్ల అవగాహనను పంచి, మా కృషిలో ఎప్పుడూ తోడుగా ఉండి, మా సక్సెస్ లకు బాటనేర్పరిచిన మా తండ్రి వెంకట్రావు గారిని ఆయన సాంవత్సరీకం సందర్భంగా స్మరించుకుంటూ” అంటూ చిరంజీవి సోషల్ మీడియా వేదికగా చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది.తండ్రిపై మెగాస్టార్ ప్రేమను నెటిజన్లు తెగ ప్రశంసిస్తున్నారు.
చిరంజీవి గొప్పదనం గురించి ఎంత చెప్పినా తక్కువేనని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.వాల్తేరు వీరయ్య చిరంజీవి కోరుకున్న మరో భారీ బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు.వాల్తేరు వీరయ్య సినిమా సక్సెస్ అటు చిరంజీవికి, ఇటు బాబీకి కీలకం కాగా ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని సొంతం చేసుకుంటుందో చూడాల్సి ఉంది.వాల్తేరు వీరయ్య మూవీలో రవితేజ కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే.
ఈ సినిమాలో ఎక్కువ సంఖ్యలో యాక్షన్ సీన్లు ఉన్నాయని సమాచారం అందుతోంది.చిరంజీవి, రవితేజ బాక్సాఫీస్ వద్ద ఏ స్థాయిలో మ్యాజిక్ చేస్తారో చూడాల్సి ఉంది.
చిరంజీవి ఈ సినిమాతో మళ్లీ బాక్సాఫీస్ వద్ద రికార్డులు క్రియేట్ చేస్తాననే నమ్మకాన్ని కలిగి ఉన్నారు.చిరంజీవి ఈ సినిమా విడుదలైన మూడు నెలలకు భోళా శంకర్ విడుదలయ్యేలా ప్లాన్ చేసుకుంటున్నారు.
చిరంజీవి సినిమాలపై మంచి అంచనాలు నెలకొన్నాయి.