అండర్ 19 ప్రపంచకప్‌ను యువ భారత్ తృటిలో చేజార్చుకున్న సంగతి తెలిసిందే.ఆదివారం జరిగిన ఫైనల్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ భారత్.79 పరుగుల తేడాతో ఆస్ట్రేలియా చేతిలో ఓటమి పాలైంది.ఆసీస్ నిర్దేశించిన 254 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో 43.5 ఓవర్లలో 174 పరుగులకే ఆలౌటైంది.ఆస్ట్రేలియా జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన హర్జాస్ సింగ్ ( Harjas Singh )(55) ఇప్పుడు రెండు దేశాల్లోనూ స్టార్‌గా నిలిచాడు.ఆసీస్ పీకల్లోతు కష్టాల్లో వుండగా.హర్జాస్ పట్టుదలగా ఆడాడు.హిక్స్‌తో కలిసి (20) నాలుగో వికెట్‌కు 66 పరుగులు జోడించి జట్టును ఆదుకున్నాడు.
భారత్ ఓటమిలో కీలకపాత్ర పోషించిన ఈ హర్జాస్ సింగ్ భారత మూలాలున్న కుర్రాడే కావడం విశేషం.ఇతని కుటుంబం 2000లో చండీగఢ్ నుంచి ఆస్ట్రేలియాలోని( Chandigarh to Australia ) సిడ్నీకి తరలివెళ్లింది.హర్జాస్ తండ్రి ఇందర్‌జిత్ సింగ్ ( Inderjit Singh )పంజాబ్ రాష్ట్ర బాక్సింగ్ ఛాంపియన్, అతని తల్లి అవిందర్ కౌర్ రాష్ట్ర స్థాయి లాంగ్ జంపర్.
జనవరి 31, 2005న సిడ్నీలో హర్జాస్ జన్మించాడు.ఎనిమిదేళ్ల వయసులో క్రికెట్ ఆడటం ప్రారంభించిన అతను న్యూసౌత్ వేల్స్‌లోని స్థానిక రెవ్స్‌బీ వర్కర్స్ క్రికెట్ క్లబ్‌లో ప్రత్యామ్నాయ ఆటగాడిగా సేవలందించాడు.
ఉస్మాన్ ఖవాజాను ఎంతో ఇష్టపడే హర్జాస్.మైఖేల్ క్లార్క్, ఫిల్ హ్యూస్, మిచెల్ స్టార్క్, మార్నస్ లాబుస్‌చాగ్నే వంటి వారికి కోచ్‌గా వ్యవహరించిన నీల్ డికోస్టా వద్ద శిక్షణ తీసుకున్నాడు.ఫెయిర్‌ఫీల్డ్‌లోని వెస్ట్‌ఫీల్డ్ స్పోర్ట్స్ హైస్కూల్‌లో చదువుకుంటున్న హర్జాస్ సింగ్.తొలుత రైట్ హ్యాండ్ బ్యాటింగ్ చేసేవాడు, కానీ తర్వాత లెఫ్ట్ హ్యాండ్‌కి మారాడు.తన భారతీయ వారసత్వం కారణంగా.నిలదొక్కుకోవడానికి ఇతరుల కన్నా ఎక్కువగా కష్టపడాల్సి వచ్చిందని హర్జాస్ సింగ్ పేర్కొన్నాడు.
మీరు ఇతరుల కంటే భిన్నంగా కనిపిస్తే.ఆ గుర్తింపును, ఫీల్డ్‌లో మీ స్థానాన్ని నిలబెట్టుకోవడానికి భిన్నంగా చేయాల్సి వుంటుందని చెప్పాడు.
నిన్నటి అండర్ 19 ప్రపంచకప్‌లో విజయం అనంతరం హర్జాస్ వెరైటీగా సంబరాలు జరుపుకున్నాడు.దీనికి సంబంధించిన వీడియోను ఐసీసీ సోషల్ మీడియాలో షేర్ చేసింది.ఐసీసీ ఇన్‌స్టాలో షేర్ చేసిన ఆ రీల్‌కు 5.7 మిలియన్లకు పైగా వీక్షణలు, 3.27 లక్షలకు పైగా లైకులు వచ్చాయి.