సామజవరగమన( Samajavaragamana ) సినిమాతో సూపర్ హిట్ అందుకున్న శ్రీ విష్ణు అదే ఊపుతో మరో సినిమా సైన్ చేశాడు.రాజ రాజ చోర సినిమా ప్రీక్వెల్ గా ఓ సినిమా చేస్తున్నాడు శ్రీ విష్ణు( Sree Vishnu ).
హసిత్ గోలి డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాకు స్వాగ్( Swag ) అనే టైటిల్ > కూడా ఫిక్స్ చేశారు.ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తుందని తెలుస్తుంది.
శ్రీ విష్ణు సరసన యంగ్ హీరోయిన్ ఒకరు ఇందులో నటిస్తున్నారట.అయితే సినిమాలో సీనియర్ హీరోయిన్ మీరా జాస్మిన్ కూడా ఉంటుందని తెలుస్తుంది.
ఒకప్పుడు సౌత్ ఆడియన్స్ ని తన న్యాచురల్ యాక్టింగ్ తో ఇంప్రెస్ చేసిన మీరా జాస్మిన్( Meera Jasmine ) ఈమధ్య సోషల్ మీడియాలో తన హాట్ ఫోటో షూట్స్ తో పిచ్చెక్కిస్తుంది.రీసెంట్ గా విమానం( Vimanam ) సినిమాలో నటించిన మీరా జాస్మిన్ శ్రీ విష్ణు సినిమాలో కూడా నటిస్తుందని తెలుస్తుంది.ఈ సినిమాలో మీరా జాస్మిన్ రోల్ నెగిటివ్ టచ్ లో ఉంటుందని తెలుస్తుంది.మీరా జాస్మిన్ ఈ సినిమాతో మరోసారి తన సత్తా చాటాలని చూస్తుంది.మరి మీరా జాస్మిన్ శ్రీ విష్ణు సినిమాకు ఎంతమేరకు ప్లస్ అవుతుంది అన్నది చూడాలి.