శ్రీవిష్ణుతో మీరా జాస్మిన్.. ఛాయిస్ కరెక్టేనా..?

సామజవరగమన( Samajavaragamana ) సినిమాతో సూపర్ హిట్ అందుకున్న శ్రీ విష్ణు అదే ఊపుతో మరో సినిమా సైన్ చేశాడు.

రాజ రాజ చోర సినిమా ప్రీక్వెల్ గా ఓ సినిమా చేస్తున్నాడు శ్రీ విష్ణు( Sree Vishnu ).

హసిత్ గోలి డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాకు స్వాగ్( Swag ) అనే టైటిల్ > కూడా ఫిక్స్ చేశారు.

ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తుందని తెలుస్తుంది.శ్రీ విష్ణు సరసన యంగ్ హీరోయిన్ ఒకరు ఇందులో నటిస్తున్నారట.

అయితే సినిమాలో సీనియర్ హీరోయిన్ మీరా జాస్మిన్ కూడా ఉంటుందని తెలుస్తుంది. """/" / ఒకప్పుడు సౌత్ ఆడియన్స్ ని తన న్యాచురల్ యాక్టింగ్ తో ఇంప్రెస్ చేసిన మీరా జాస్మిన్( Meera Jasmine ) ఈమధ్య సోషల్ మీడియాలో తన హాట్ ఫోటో షూట్స్ తో పిచ్చెక్కిస్తుంది.

రీసెంట్ గా విమానం( Vimanam ) సినిమాలో నటించిన మీరా జాస్మిన్ శ్రీ విష్ణు సినిమాలో కూడా నటిస్తుందని తెలుస్తుంది.

ఈ సినిమాలో మీరా జాస్మిన్ రోల్ నెగిటివ్ టచ్ లో ఉంటుందని తెలుస్తుంది.

మీరా జాస్మిన్ ఈ సినిమాతో మరోసారి తన సత్తా చాటాలని చూస్తుంది.మరి మీరా జాస్మిన్ శ్రీ విష్ణు సినిమాకు ఎంతమేరకు ప్లస్ అవుతుంది అన్నది చూడాలి.

చరణ్ కోసం చిరంజీవి త్యాగం చేస్తారా.. తండ్రి మనస్సు ఎంతైనా గొప్పదంటూ?