'గుంటూరు కారం'లో ఆఫర్ అందుకున్న ఆ బ్యూటీ.. ఈమెను ఎవ్వరూ ఊహించరు కూడా!

సూపర్ స్టార్ మహేష్ బాబు ( Mahseh babu )సర్కారు వారి పాట వంటి హిట్ తర్వాత మరో సినిమా పూర్తి చేయలేదు.అయితే త్రివిక్రమ్ తో సినిమా అయితే ఎప్పుడో ప్రకటించాడు కానీ ఈ సినిమా ఎన్నో అవాంతరాల మధ్య ఈ ఏడాది జనవరిలో స్టార్ట్ అయ్యింది.

 Meenakshi Chaudhary In Mahesh Babu Guntur Karam, Guntur Kaaram, Mahesh Babu, T-TeluguStop.com

ఎట్టకేలకు స్టార్ట్ అయ్యి రెండు షెడ్యూల్స్ అయితే పూర్తి చేసుకుంది.కానీ మళ్ళీ సమ్మర్ ముందు వాయిదా పడింది.

అప్పుడు వాయిదా పడడం మళ్ళీ ఇంత వరకు స్టార్ట్ అవ్వలేదు.అంతేకాదు మళ్ళీ ఈ సినిమాపై వస్తున్న వార్తలతో సూపర్ స్టార్ ఫ్యాన్స్ భయపడ్డారు.

గత కొద్దీ రోజులుగా ఎన్నో కారణాలుగా షూటింగ్ అయితే స్టార్ట్ కాలేదు.దీంతో ఈ విషయంలో నిరాశలో ఉన్న ఫ్యాన్స్ కు షూట్ మళ్ళీ స్టార్ట్ అయ్యింది అని తెలిసి ఆనందంగా ఉన్నారు.

ఇదంతా పక్కన పెడితే ఈ సినిమాలో ముందుగా పూజా హెగ్డే, శ్రీలీల(SreeLeela ) హీరోయిన్ లుగా నటిస్తున్నట్టు తెలిపారు.పూజా మెయిన్ హీరోయిన్ కాగా శ్రీలీల సెకండ్ హీరోయిన్ గా తీసుకున్నారు.అయితే పూజా హెగ్డే ఈ సినిమా నుండి తప్పుకోవడంతో శ్రీలీల ఇప్పుడు మెయిన్ హీరోయిన్ పాత్రలోకి వచ్చేసింది.అయితే సెకండ్ హీరోయిన్ కోసం త్రివిక్రమ్ టీమ్ జల్లెడ పడుతుంది.

ఈ క్రమంలోనే ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా ఒక యంగ్ బ్యూటీని తీసుకున్నట్టు తెలుస్తుంది.ఆమె మరెవరో కాదు మీనాక్షి చౌదరి( Meenakshi chaudhary ).ఖిలాడీ, హిట్ 2 వంటి సినిమాలతో ఆకట్టుకున్న మీనాక్షి చౌదరి మహేష్ బాబు సరసన అవకాశం అందుకుంటే అది లక్ అనే చెప్పాలి.ముందుగా సంయుక్త మీనన్ పేరు వినిపించిన ఇప్పుడు మాత్రం ఈమెను పక్కకు నెట్టి మీనాక్షి ముందుకు వచ్చినట్టు తెలుస్తుంది.

మరి ఈ అమ్మడుని నిజంగానే తీసుకున్నారో లేదో తెలియాలంటే మరికొద్ది రోజులు వేచి ఉండాల్సిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube