‘గుంటూరు కారం’లో ఆఫర్ అందుకున్న ఆ బ్యూటీ.. ఈమెను ఎవ్వరూ ఊహించరు కూడా!
TeluguStop.com
సూపర్ స్టార్ మహేష్ బాబు ( Mahseh Babu )సర్కారు వారి పాట వంటి హిట్ తర్వాత మరో సినిమా పూర్తి చేయలేదు.
అయితే త్రివిక్రమ్ తో సినిమా అయితే ఎప్పుడో ప్రకటించాడు కానీ ఈ సినిమా ఎన్నో అవాంతరాల మధ్య ఈ ఏడాది జనవరిలో స్టార్ట్ అయ్యింది.
ఎట్టకేలకు స్టార్ట్ అయ్యి రెండు షెడ్యూల్స్ అయితే పూర్తి చేసుకుంది.కానీ మళ్ళీ సమ్మర్ ముందు వాయిదా పడింది.
అప్పుడు వాయిదా పడడం మళ్ళీ ఇంత వరకు స్టార్ట్ అవ్వలేదు.అంతేకాదు మళ్ళీ ఈ సినిమాపై వస్తున్న వార్తలతో సూపర్ స్టార్ ఫ్యాన్స్ భయపడ్డారు.
గత కొద్దీ రోజులుగా ఎన్నో కారణాలుగా షూటింగ్ అయితే స్టార్ట్ కాలేదు.దీంతో ఈ విషయంలో నిరాశలో ఉన్న ఫ్యాన్స్ కు షూట్ మళ్ళీ స్టార్ట్ అయ్యింది అని తెలిసి ఆనందంగా ఉన్నారు.
"""/" /
ఇదంతా పక్కన పెడితే ఈ సినిమాలో ముందుగా పూజా హెగ్డే, శ్రీలీల(SreeLeela ) హీరోయిన్ లుగా నటిస్తున్నట్టు తెలిపారు.
పూజా మెయిన్ హీరోయిన్ కాగా శ్రీలీల సెకండ్ హీరోయిన్ గా తీసుకున్నారు.అయితే పూజా హెగ్డే ఈ సినిమా నుండి తప్పుకోవడంతో శ్రీలీల ఇప్పుడు మెయిన్ హీరోయిన్ పాత్రలోకి వచ్చేసింది.
అయితే సెకండ్ హీరోయిన్ కోసం త్రివిక్రమ్ టీమ్ జల్లెడ పడుతుంది. """/" /
ఈ క్రమంలోనే ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా ఒక యంగ్ బ్యూటీని తీసుకున్నట్టు తెలుస్తుంది.
ఆమె మరెవరో కాదు మీనాక్షి చౌదరి( Meenakshi Chaudhary ).ఖిలాడీ, హిట్ 2 వంటి సినిమాలతో ఆకట్టుకున్న మీనాక్షి చౌదరి మహేష్ బాబు సరసన అవకాశం అందుకుంటే అది లక్ అనే చెప్పాలి.
ముందుగా సంయుక్త మీనన్ పేరు వినిపించిన ఇప్పుడు మాత్రం ఈమెను పక్కకు నెట్టి మీనాక్షి ముందుకు వచ్చినట్టు తెలుస్తుంది.
మరి ఈ అమ్మడుని నిజంగానే తీసుకున్నారో లేదో తెలియాలంటే మరికొద్ది రోజులు వేచి ఉండాల్సిందే.
ఈ వారం ఓటీటీ, థియేటర్లలో రిలీజయ్యే సినిమాల జాబితా ఇదే.. తండేల్ హిట్టవుతుందా?