ఈ టాప్-10 బడా కంపెనీలకు ఏమైంది... ఇక సర్దుకోవలసిందేనా?

కొత్త సంవత్సరంలోకి అడుగిడడానికి మరికొన్ని రోజులు మాత్రమే మిగిలి వున్నాయి.దాంతో దేశ ప్రజలు ముందుగానే సెలబ్రేషన్స్ షురూ చేస్తున్నారు.

 Market Capitalizations Of These Top Ten Companies Fell Sbi Airtel Infosys Tcs Ic-TeluguStop.com

అయితే ఆ ఆనందం ఈక్విటీ మార్కెట్లలో మాత్రం మచ్చుకైనా కనిపించటం లేదు.అవును, దానికి కారణం ద్రవ్యోల్బణం వల్ల తీసుకుంటున్న అనేక చర్యల వల్ల బలహీనమైన ట్రెండ్ ప్రస్తుతం నడుస్తోంది.

ఈ క్రమంలో టాప్-10 కంపెనీలు సైతం చాలా వెనుకంజలో ఉండటం కొసమెరుపు.వాటిలోని తొమ్మిది కంపెనీల విలువ బాగా క్షీణించినట్టు రిపోర్ట్.

ఈ క్రమంలో BSE బెంచ్ మార్క్ సూచీ సైతం గతవారం పాయింట్లు లేదా 1.36 శాతం క్షీణించింది.వీటిలో HDFC బ్యాంక్ మినహా.ఇన్ఫోసిస్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, ICICI బ్యాంక్, హిందుస్థాన్ యూనిలీవర్‌తో సహా మరికొన్ని బడా కంపెనీల విలువ దారుణంగా పడిపోయింది.రిలయన్స్ ఇండస్ట్రీస్ వాల్యుయేషన్ రూ.29,767.66 కోట్లు తగ్గి రూ.17,35,405.81 కోట్లకు చేరుకోగా TCS తన మార్కెట్ వాల్యుయేషన్‌లో రూ.19,960.12 కోట్ల క్షీణతతో రూ.11,84,837.43 కోట్లకు చేరుకోవడం గమనార్హం.

అలాగే ICICI బ్యాంక్ విలువ రూ.19,722.3 కోట్లు దిగజారగా ఇన్ఫోసిస్ విలువ రూ.19,567.57 కోట్లకు పతనమైపోయింది.ఇక హిందుస్థాన్ యూనిలీవర్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.11,935.92 కోట్లు తగ్గి రూ.6,27,434.85 కోట్లకు చేరుకుంది.SBI రూ.11,735.86 కోట్లు తగ్గగా భారతీ ఎయిర్‌టెల్ మార్కెట్ క్యాప్ రూ.7,204.38 కోట్లు మేర దిగజారింది.అలాగే అదానీ ఎంటర్‌ప్రైజెస్ మార్కెట్ విలువ రూ.1,903.8 కోట్లు తగ్గి రూ.4,53,617.85 కోట్లకు పడిపోగా HDFC mcap రూ.295.29 కోట్లు తగ్గి రూ.4,86,460.48 కోట్లకు చేరుకుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube