Manchu Manoj : నేను ఏ పార్టీని ఉద్దేశించి మాట్లాడలేదు…క్లారిటీ ఇచ్చిన మనోజ్ !

సినీ నటుడు మంచు మనోజ్ ( Manchu Manoj ) ఇటీవల తన తండ్రి మోహన్ బాబు( Mohan Babu ) పుట్టినరోజు సందర్భంగా మోహన్ బాబు యూనివర్సిటీలో ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమంలో మాట్లాడుతూ చేస్తున్నటువంటి కామెంట్స్ సోషల్ మీడియాలో సంచలనంగా మారాయి ముఖ్యంగా ఓటు వేసే విషయం గురించి ఈయన అవగాహన కల్పిస్తూ మీ అందరితో కలిసి నడిచే నాయకుడిని ఎన్నుకోండి డబ్బులు ఇచ్చినా తీసుకొని మీకు ఎవరైతే మంచి చేస్తారని అనిపిస్తుందో అలాంటి వారికే ఓటు వేయాలి అంటూ చెప్పుకు వచ్చారు.సొంత కుటుంబానికి న్యాయం చేయలేని వాడు మనకేం న్యాయం చేస్తాడు.

 Manoj Gives Clarity About Latest His Political Comments-TeluguStop.com

ఎవరైనా డబ్బులిస్తే థ్యాంక్స్ చెప్పండి.ఓటు మాత్రం సరైన వ్యక్తికే వేయండని చెప్పారు.

ఇక మనోజ్ సొంత కుటుంబానికి న్యాయం చేయలేని వారు మీకేం చేస్తారో అనే వ్యాఖ్యలు చేయడంతో ఈయన పక్కా ఈ వ్యాఖ్యలను వైఎస్ఆర్సిపి పార్టీని ( YSRCP Party ) ఉద్దేశించి మాట్లాడారని పలువురు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోల్స్ చేస్తున్నారు.ఇలా తన గురించి వస్తున్నటువంటి ఈ ట్రోల్స్ పై మనోజ్ స్పందించారు.ఈ క్రమంలోనే తాను ఎలాంటి ఉద్దేశంతో ఈ వ్యాఖ్యలు చేశాను అనే విషయాల గురించి ఈయన క్లారిటీ ఇచ్చారు.

నాన్న పుట్టినరోజు వేడుకల్లో నా ప్రసంగంపై నెలకొన్న గందరగోళంపై స్పష్టత ఇవ్వాలనుకున్నా.ప్రతీది రాజకీయంగా చూడకుండా ఐక్యత, గౌరవంగా ముందుకు సాగాలనేది నా మాటలకు అర్థం అంతేకానీ నేను ఏ పార్టీకి సపోర్ట్ చేయలేదని మరే పార్టీని ఉద్దేశించి కూడా నేను అలాంటి వ్యాఖ్యలు చేయలేదు అంటూ ఈయన ఆ కార్యక్రమంలో తాను మాట్లాడినటువంటి వ్యాఖ్యలకు సంబంధించిన పూర్తి వీడియోని కూడా షేర్ చేశారు.బహుశా సాంకేతిక లోపం కారణంగా మీరు తప్పుగా అర్థం చేసుకుని ఉండొచ్చు అంటూ మనోజ్ ఆ వీడియోని షేర్ చేస్తూ క్లారిటీ ఇచ్చారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube